Begin typing your search above and press return to search.

రామారావుతో స్వయంవరం స్టార్ కు సక్సెస్‌ పడేనా?

By:  Tupaki Desk   |   2 Feb 2022 3:30 AM GMT
రామారావుతో స్వయంవరం స్టార్ కు సక్సెస్‌ పడేనా?
X
రవితేజ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడి సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతుంది. మరో వైపు రామారావు ఆన్ డ్యూటీ సినిమా ను కూడా విడుదలకు ముస్తాబు చేస్తున్నారు. అవి మాత్రమే కాకుండా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా.. వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు మరియు రావణాసుర అనే మరో సినిమాను కూడా రవితేజ చేస్తున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రవితేజ ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలను చేస్తున్నాడు. ఇన్ని సినిమాల్లో రవితేజ ఈ ఏడాది కనీసం మూడు సినిమాలను అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈయన సినిమాల్లో ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు. ముఖ్యంగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్న వేణు తొట్టెంపూడి గురించి చర్చ జరగుతోంది.

ఖిలాడి సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. రవితేజ మరో సినిమాలో విష్ణు విశాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కీలక పాత్రను సీనియర్ నటుడు.. స్వయంవరం హీరో వేణు తొట్టెంపూడి నటించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. హీరోగా పలు సినిమాల్లో నటించిన వేణు రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇప్పటికే కొన్ని ఆఫర్లు ఆయన తలుపు తట్టినా స్టార్‌ హీరో సినిమాలో అయితే చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పాడట. ఎట్టకేలకు రవితేజ సినిమా లో ఛాన్స్ రావడంతో వేణు ఓకే చెప్పాడని తెలుస్తోంది.

వేణు చివరగా రామాచారి సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా ఈయన కనిపించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. రవితేజ సినిమాలో వేణు నటించబోతున్నాడు అనే విషయం అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే అందరి దృష్టి సినిమాపై పడింది. రవితేజ చాలా నమ్మకంతో రామారావు ఆన్ డ్యూటీ సినిమాను చేస్తున్నాడు. శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్న విషయం తెల్సిందే. మరి వేణు ఎలా కనిపించబోతున్నాడు అనేది చూడాలి.

ఈ సినిమాలో ఆయన కు మంచి పాత్ర దక్కితే ఖచ్చితంగా సెకండ్‌ ఇన్నింగ్స్ బలంగా మొదలు అయ్యే అవకాశం ఉంటుంది. రామారావు ఆన్ డ్యూటీ తో వేణు మళ్లీ సక్సెస్ ట్రాక్ లో పడితే పెద్ద సినిమాల్లో ఈయనకు అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక రామారావు ఈ వేణు ను ఏం చేస్తాడు అనేది చూడాలి. వేణు నటుడిగా ఎన్నో మంచి సినిమాలు చేశాడు. మంచి టైమింగ్ ఉన్న నటుడిగా వేణు పేరు దక్కించుకున్నాడు. అయితే లక్ కలిసి రాక సినిమాలు ప్లాప్‌ అవ్వడంతో దాదాపు పదేళ్లు ఇండస్ట్రీకి దూరం గా ఉన్నాడు. ఈ రీ ఎంట్రీతో వేణు కు సక్సెస్ లు దక్కుతాయా అనేది చూడాలి.