Begin typing your search above and press return to search.

త్వరలోనే టీవీ హోస్ట్ గా మారనున్న జగ్గూభాయ్..

By:  Tupaki Desk   |   25 March 2020 6:00 AM IST
త్వరలోనే టీవీ హోస్ట్ గా మారనున్న జగ్గూభాయ్..
X
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే అది జగపతి బాబు మాత్రమే. హీరోగా వెండితెరకు పరిచయమైన ఆయన ఫ్యామిలీ హీరోగా విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉన్నాడు. ఒకప్పుడు హీరోగా లేడీ ఫ్యాన్స్ గుండెల్లో గుడిగంటలు మ్రోగించిన జగపతి బాబు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. హీరో అయినా క్యారెక్టర్ అయినా ఇట్టే మెప్పించగల ఆయన త్వరలోనే బుల్లితెరపై కూడా మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు.

ఇదివరకే చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాని, రానా, సాయికుమార్, అలీ లాంటి సెలబ్రిటీలు టీవీ తెరపై సందడి చేసిన విషయం తెలిసిందే. ఎల్లప్పుడూ హీరోయిక్ ఫిజిక్ మెయింటైన్ చేసే జగపతి బాబు, ఒక రియాలిటీ షో ద్వారా హోస్ట్ గా మారనున్నాడు. బుల్లితెరపై కూడా మెప్పించడం అంత ఈజీ కాదు.. బ్రహ్మానందం లాంటి గొప్ప వ్యక్తి కూడా చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. తన అదృష్టం కూడా ఎలా ఉందో పరీక్షించుకోవడానికి జగ్గు భాయ్ రంగంలోకి దిగుతున్నాడట.

ఇక తాజాగా జగపతి బాబు.. లక్షలాది అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆయనను ఎంపిక చేసినట్లు అర్ధమవుతుంది. ఫ్యాన్స్ కూడా జగపతి బాబును ఆదరిస్తారనే అనుకుంటున్నారు. జగపతి బాబు చివరిగా సైరా నరసింహరెడ్డి సినిమాలో కన్పించాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆయన హోస్ట్ గా రియాలిటీ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందో అని బుల్లితెర ప్రేక్షకులలో కొంత ఆసక్తి నెలకొంది.