Begin typing your search above and press return to search.

న‌టుడికి టీడీపీ బెదిరింపు కాల్స్?

By:  Tupaki Desk   |   14 April 2019 5:39 AM GMT
న‌టుడికి టీడీపీ బెదిరింపు కాల్స్?
X
ఆర్జీవీ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఏపీ మిన‌హా అన్ని చోట్లా రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ ఫ‌లితం ఎలా ఉంది? అన్న‌దానికంటే ఇందులో న‌టించిన పాత్ర‌ధారుల గురించి ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు పాత్ర‌ధారి శ్రీ‌తేజ్ ష‌టిల్డ్ పెర్ఫామెన్స్ కి క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. అచ్చం చంద్ర‌బాబు జిరాక్స్ లా క‌నిపించాడు. ఆ చూపు.. న‌డ‌క‌.. అన్నీ అచ్చం ఆయ‌నే అని పొగిడేశారు. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఎందుక‌నో గొప్ప‌గా న‌టించినా ఆ న‌టుల‌కు మీడియా ఫోక‌స్ మిస్స‌య్యింది.

చంద్ర‌బాబు పాత్ర‌ధారి శ్రీ‌తేజ్ ని కొన్ని విష‌యాల‌పై ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులే చెప్పారాయ‌న‌. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నిజాల్ని దాచార‌ని... వ‌న్‌సైడ్ చేశార‌ని విమ‌ర్శ‌లొచ్చాయి క‌దా? అని ప్ర‌శ్నిస్తే.. ఆ పాత్ర‌కి నేను ఏం చేస్తున్నాను ఇంకా ఏం చెయ్యాలి? ఇంత‌వ‌ర‌కే నేను ఆలోచిస్తాను కాని మిగ‌తావ‌న్నీ ఆలోచించ‌ను అని అన్నారు. నా పాత్ర‌కి నేను న్యాయం చేస్తాను. విమ‌ర్శ‌ల‌ పైన పెద్ద‌గా అవ‌గాహ‌న‌లేదు. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం. అందువ‌ల్ల నా ఆలోచ‌నా విధానం అంతా నా న‌ట‌న పైనే అని తెలిపారు.

సినిమా చూసి టీడీపీ వాళ్లు ఏమ‌న్నారు? ఎవ‌ర‌యినా తిట్టారా? అంటే.. నాకు టీడీపీ వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా చూసి అంద‌రూ లుక్ చూడ‌గానే అందరూ సూప‌ర్భ్ .. నువ్ ఫెంటాస్టిక్‌గా సెట్ అయ్యావ్. ఏ పాత్ర‌కైనా భ‌లే సెట్ అవుతున్నావ్ ఎలా అని అడిగారు. అచ్చం చంద్ర‌బాబులానే ఉన్నావు. చాలా బావుంది లుక్... మేమైతే సినిమా చూడం అని చెప్పారు. ప్ర‌త్యేకించి ఎవ‌రూ తిట్ట‌లేదు. టీడీపీ వాళ్ల‌ థ్రెట్ కాల్స్ ఏమైనా వ‌చ్చాయా? అని ప్ర‌శ్నిస్తే.. అలా ఏమీ లేదు. కానీ సోష‌ల్ మీడియాలో ఎఫ్‌.బి, ట్విట్ట‌ర్‌లో చిన్న చిన్న మెసేజ్ లు పెట్టారు. చంద్ర‌బాబుగారి ఫ్యాన్స్ ఉంటారు క‌దా వాళ్ళు కొంచెం బాద‌ప‌డ్డామ‌ని మెసేజెస్ చేశారు అంతే. ఒక న‌టుడిగా నాప‌ని నేను చేస్తున్నాను అని తెలుసు అంద‌రికీ. మేం కేవ‌లం యాక్ట‌ర్స్ మాత్ర‌మే అని అన్నారు. ఏపీలో విడుద‌ల కాలేదు క‌దా.. న‌ష్టం ఎంత వ‌ర‌కూ? అని ప్ర‌శ్నిస్తే.. న‌ష్టం గురించి తెలియ‌దు కానీ ఇండియాలో చాలా చోట్ల‌ రిలీజ్ అయింది. తెలంగాణ, ముంబై, అమెరికా, అన్ని ఏరియాల్లో మంచి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఒక న‌టుడిగా ఏపీలోనూ రిలీజ్ అయి ఉంటే అక్క‌డ ప్రేక్ష‌కులు కూడా చూసేవారు అనుకున్నా. అంతేకాని ప్రొడ‌క్ష‌న్ సైడ్ నేనెప్పుడూ ప‌ట్టించుకోలేదు. డైరెక్ట‌ర్‌, నిర్మాత‌ ఆ ప‌నుల‌న్నీ చూస్తున్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సీక్వెల్ ఉంటుందా? అంటే .. అందుకు ఛాన్స్ ఉందో లేదో.. ఆర్జీవీనే అడ‌గాలి. అత‌డికి వ‌రుస‌గా ఆరు సినిమాలు క్యూలో ఉన్నాయ‌ని శ్రీ‌తేజ్ తెలిపారు.