Begin typing your search above and press return to search.

ట్రాల్ పేజీస్ వలన రెవెన్యూ పోతోంది

By:  Tupaki Desk   |   13 April 2017 10:02 AM GMT
ట్రాల్ పేజీస్ వలన రెవెన్యూ పోతోంది
X
ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే చాలు.. పొలిటికల్ పంచుల నుండి సినిమాల మీద కామెడీ చేయడం వరకు.. అనేకానేక ట్రాలిం్ పేజిస్ కనబడుతున్నాయి. అయితే ఈ ట్రాలింగ్ పేజీల వలన సినిమాలకు వచ్చే రెవెన్యూ పడిపోతుంది అంటే మీరు నమ్ముతారా? కాని కాటమరాయుడి తమ్ముడు మాత్రం.. వీటివలనే నష్టం వస్తోంది అంటున్నాడు.

ఆన్ లైన్ లో అసలు సినిమాలపై సినిమావారిపై కామెంట్లు చేసేవారికి కాస్త కూడా హద్దులు అనేవి ఉండట్లేదని.. అలా హద్దులు దాటినవారిపై యాక్షన్ తీసుకోవాలని.. ఇప్పుడు నటుడు శివ బాలాజీ కోరుతున్నాడు. ఆల్రెడీ సైబర్ క్రైమ్ లో మనోడిపై ఫేస్ బుక్ లో కొందరు చేసిన నెగెటివ్ కామెంట్లపై కంప్లయిట్ ఇస్తూ.. ఇప్పుడు కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశాడు. అలాగే మూవి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కూడా ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కంప్లయింట్ ఇస్తున్నాడు.

''నిజానికి ఈ ట్రాలింగ్ చేసేవారి వలన సినిమాల రెవెన్యూ కూడా పడిపోతోంది. వీరు సినిమా రిలీజవ్వగానే ఇష్టం వచ్చినట్లు ట్రాల్స్ చేస్తుంటే.. అది నెగెటివ్ పబ్లిసిటీకి దారితీసి.. ఆడియన్స్ ధియేటర్లకు రావట్లేదు'' అంటూ సెలవిచ్చాడు శివబాలాజీ. వామ్మో .. ట్రాలింగ్ వలన రెవెన్యూలు పడిపోతుంటే.. మీరు ఫ్లాపు సినిమాల వలన మా జేబులు గుల్లయిపోతున్నాయి అంటూ ఆడియన్స్ కూడా ప్రొడ్యూసర్లపై కేసులు పెట్టాలేమో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/