Begin typing your search above and press return to search.
మాయాబజార్ టేస్టు సూపరంటున్న రాజమౌళి
By: Tupaki Desk | 14 Nov 2016 4:48 AM ISTమాయాబజార్ ఏంటి.. టేస్టు సూపర్ గా ఉండటం ఏంటి అంటారా..? ఈ మాయాబజార్ సినిమా కాదు లెండి. రెస్టారెంట్. ఐతే.. సై లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శశాంత్ మాదాపూర్లో ఏడాది కిందట మాయాబజార్ పేరుతో ఓ రెస్టారెంట్ తెరిచాడు. అది ఈ ఏడాది కాలంలో బాగానే పాపులర్ అయింది. మాయా బజార్ అని చక్కటి పేరు పెట్టడమే కాదు.. లోపల ఘటోత్కచుడి రూపంలో ఎస్వీఆర్ ఫొటోలతో భలే ఆకర్షణీయంగా ఈ రెస్టారెంటును తీర్చిదిద్దాడు శశాంక్. చక్కటి యాంబియన్స్ .. రుచికరమైన ఫుడ్.. ఈ రెస్టారెంట్ వేగంగా పాపులర్ కావడానికి కారణమయ్యాయి.
దీనికి తోడు తనకు ఇండస్ట్రీలో పరిచయమున్న సెలబ్రెటీలందరినీ తరచుగా రెస్టారెంటుకు ఆహ్వానించి సోషల్ మీడియాలో మంచి ప్రచారం దక్కేలా చూసుకుంటున్నాడు శశాంక్. తాజాగా ‘మాయాబజార్’ ప్రథమ వార్షికోత్సవం నేపథ్యంలో రాజమౌళి.. కీరవాణిలతో పాటు వారి కుటుంబ సభ్యులు రెస్టారెంటుకు వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడి వాతావరణం గురించి.. ఫుడ్ గురించి ట్వీట్ చేశాడు రాజమౌళి. జక్కన్నకు సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ ఏంటో తెలిసిందే కాబట్టి.. ఆయన ట్వీట్ శశాంక్ రెస్టారెంటుకు ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు అల్లరి నరేష్.. నాని లాంటి వాళ్లు కూడా రెస్టారెంటుకు వచ్చి ప్రమోట్ చేశారు. మొత్తానికి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయినప్పటికీ ఈ రెస్టారెంటుతో శశాంక్ బాగానే స్థిరపడేట్లున్నాడు.