Begin typing your search above and press return to search.

న‌ట‌నే కాదు ఈసారి డ్యాన్సుల‌తోనూ కొడ‌తాడు

By:  Tupaki Desk   |   7 Aug 2021 4:58 AM GMT
న‌ట‌నే కాదు ఈసారి డ్యాన్సుల‌తోనూ కొడ‌తాడు
X
వ‌ర్షం ద‌ర్శ‌కుడు శోభ‌న్ వార‌సుడు సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టించిన `ఏక్ మినీ క‌థ` ఘ‌న‌విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. యువి సంస్థ నిర్మించిన‌ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఏక్ మినీ కథతో మంచి ముద్ర వేసిన ఈ యువ‌హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీ అవుతున్నారు. తదుపరి `మంచి రోజులు వ‌చ్చాయి` అనే చిత్రంలో సంతోష్ న‌టించారు. ఇందులో మెహ్రీన్ క‌థానాయిక‌. ఈ మూవీ కూడా త్వ‌ర‌లో విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది.

`ఏక్ మినీ క‌థ` విష‌యంలో న‌ట‌న త‌దిత‌ర అంశాలపై దృష్టి పెట్టి సక్సెస్ కొట్టిన సంతోష్ శోభ‌న్ ఈసారి డాన్స్ ఫైట్స్ త‌దిత‌ర విష‌యాలుపైనా ఫోక‌స్ పెట్టార‌ట‌. మంచి రోజులు వ‌చ్చాయి సినిమాలో సంతోష్ న‌ట‌న‌తో పాటు డాన్స్ లు కూడా అద‌ర‌గొట్టాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో థియేట‌ర్ కి విడుద‌ల చేయాల‌న్న‌ది మేక‌ర్స్ ప్లాన్. సినిమా అన్నిప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. విడుద‌ల‌ తేదీని ప్ర‌క‌టించాల్సి ఉంది.

ఈ సినిమా త‌ర్వాత సంతోష్ కెరీర్ గ్రాఫ్ పెద్ద‌గానే ప్లాన్ చేశారు. నందిని రెడ్డి దర్శకత్వంలోను ఓ సినిమాలో సంతోష్ న‌టించ‌నున్నారు. 2017 తమిళ థ్రిల్లర్ 8 తోట్టక్కల్ తెలుగు రీమేక్ లో సంతోష్ శోభన్ ప్రధాన పాత్ర పోషించనున్నార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. ఈ రీమేక్ తో చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా తన చలన చిత్ర ప్రవేశం చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. 8 తోటక్కల్ కు యువ కోలీవుడ్ దర్శకుడు శ్రీ గణేష్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించనున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఒక హిట్టు ప‌డ‌గానే యువ‌హీరో సంతోష్ శోభ‌న్ కి మంచి అవ‌కాశాలొస్తున్నాయి. ప్ర‌తిదీ స‌ద్వినియోగం చేసుకుని హీరోగా రాణించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. వ‌ర్షంతో త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇచ్చిన శోభ‌న్ వార‌సుడి కెరీర్ కోసం ప్ర‌భాస్ అండ్ యువి బ్యాక్ ఎండ్ లో సాయం చేస్తున్న సంగతి తెలిసిన‌దే.