Begin typing your search above and press return to search.

`పెళ్లిసంద‌D` త‌ర్వాత శ్రీ‌కాంత్ వారసుడి ప్లానింగ్?

By:  Tupaki Desk   |   9 Jan 2022 11:30 PM GMT
`పెళ్లిసంద‌D` త‌ర్వాత శ్రీ‌కాంత్ వారసుడి ప్లానింగ్?
X
శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్ హీరోగా రంగ ప్ర‌వేశం చేసి రెండు చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే పెళ్లి సంద‌-డి చిత్రంతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. రోష‌న్-శ్రీలీల జంట‌గా న‌టించిన `పెళ్లిసంద‌D` ద‌స‌రా కానుక‌గా రిలీజ్ అయి యావ‌రేజ్ విజ‌యం అందుకున్న‌ సంగ‌తి తెలిసిందే. రివ్యూల ప‌రంగా నెగిటివ్ టాక్ వ‌చ్చినా రిలీజ్ లు లేక‌పోవ‌డంతో `పెళ్లిసంద‌D` స‌క్సెస్ తో గ‌ట్టెక్కింద‌ని క‌థ‌నాలొచ్చాయి. రోష‌న్- శ్రీ‌లీల జంట‌ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన సినిమా లాభాలు బాగానే తెచ్చిపెట్టింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన సినిమా కొన్ని రోజుల పాటు హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో న‌డిచింది. ఆ ర‌కంగా యంగ్ హీరో రోష‌న్ ఖాతాలో తొలి స‌క్సెస్ న‌మోదైంది. యాక్టింగ్ ప‌రంగానూ బెట‌ర్ మెంట్ చూపించాడు యంగ్ బోయ్. అయితే ఈ సినిమాలో కిల్లింగ్ బెంగుళూరు బ్యూటీ శ్రీలీల న‌ట‌న హైలైట్. ముఖ్యంగా త‌న‌లో మంచి డాన్స‌ర్ ఉంద‌ని నిరూపించింది.

తొలి సినిమాతోనే స్టార్ హీరోల‌కు హీరోయిన్ గా ప్ర‌మోట్ అయిందంటే బ్యూటీ ప్ర‌తిభ‌కి నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంద‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం సాగుతోంది. డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ హ‌క్కుల్ని చేజిక్కించుకుంద‌ని బ‌ల‌మైన ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు విష‌యాన్ని డిస్నీ హాట్ స్టార్ నిర్వాహ‌కులు ఈ సినిమా హ‌క్కులు త‌మ‌వి కాద‌ని వెల్ల‌డించింది. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ప్ర‌చారంలో ఎంత మాత్రం నిజం లేద‌ని.. అవ‌న్నీ త‌ప్పుడు క‌థ‌నాల‌ని తెలిపారు. దీంతో `పెళ్లిసంద‌D` ఓటీటీ రైట్స్ ఏ సంస్థ ద‌క్కించుకుందో క్లారిటీ మిస్స‌య్యింది.

సినిమా రిలీజ్ కాకుండానే ఓటీటీ బిజినెస్ క్లోజ్ చేస్తున్నారు. అలాంటింది ఈ సినిమా రిలీజ్ అయి నెల‌లు గ‌డుస్తున్నా ఓటీటీ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. మ‌రి ఆ వివ‌రాలు నిర్మాత‌లు వెల్ల‌డిస్తే త‌ప్ప స్ప‌ష్ట‌త రాదు. థియేట్రికల్ రిలీజ్ తో సంబంధం లేకుండా ఓటీటీ సంస్థ‌లు మంచి ఆఫ‌ర్ల‌తో ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఓటీటీ సంస్థ‌లు మంచి ధ‌ర‌కు కంటెట్ ని కొనుగోలు చేస్తున్నాయి. రోష‌న్ కి కూడా నేటిత‌రం హీరోల‌కు ధీటుగా ఓటీటీ మార్కెట్ పెంచ‌డం పెద్ద స‌మ‌స్య ఏమీ కాదు. అత‌డికి మెగా - అక్కినేని టాప్ హీరోల అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి. అయితే త‌న‌ని స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లేందుకు హీరో శ్రీ‌కాంత్ మ‌రింత‌గా ప్లానింగ్ కి రూప‌క‌ల్పన చేయాల్సి ఉంటుంది. `పెళ్లిసంద‌D` త‌ర్వాత రోష‌న్ ప్లానింగ్ ఎలా ఉందో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి అభిమానుల‌కు ఉంది. స్ట‌డీస్ ని కొన‌సాగిస్తూనే రోష‌న్ న‌ట‌న‌లో కొన‌సాగుతున్నారు. అందుకే ఇప్పుడు దానిపై స్ప‌ష్ఠ‌త‌నిస్తారేమో చూడాలి.