Begin typing your search above and press return to search.

మెగా హీరో గాలి అటు మ‌ళ్లుతోందేంట‌బ్బా?

By:  Tupaki Desk   |   16 Nov 2022 2:30 AM GMT
మెగా హీరో గాలి అటు మ‌ళ్లుతోందేంట‌బ్బా?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `RRR` తో వ‌ర‌ల్డ్ వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా వండ‌ర్ త‌రువాత చ‌ర‌ణ్ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో RC15 లో న‌టిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్నఈ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో వుంది.

క‌మ‌ల్ హాస‌న్ `ఇండియ‌న్ 2` రీస్టార్ట్ కావ‌డంతో RC15 కు కాస్త బ్రేక్ ప‌డింది. మ‌ళ్లీ ఈ మూవీ షూటింగ్ ని ప్రారంభించ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ త‌రువాత రామ్ చ‌ర‌ణ్ ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నాడ‌న్న‌ది గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 'జెర్సీ' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్ లో యువీ క్రియేష‌న్స్ ఓ భారీ మూవీని ప్లాన్ చేసింది. 'RRR' రిలీజ్ కు ముందు ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశారు.

అయితే 'RRR' పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన త‌రువాత చ‌ర‌ణ్ తో సినిమా అంటే స‌మీక‌ర‌ణాల‌న్నీ మారిపోయాయి. చ‌ర‌ణ్ తో సినిమా అంటే మార్కెట్ లెక్క‌ల‌ని బ‌ట్టి పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేయాల‌నే లెక్క‌లు మారిపోయాయి. దీంతో గౌత‌మ్ తిన్న‌నూరి ప్రాజెక్ట్ కాస్తా ఆగిపోయింది. ఆ స్థానంలో క‌న్న‌డ డైరెక్ట‌ర్ నార్త‌న్ తో క‌లిసి సినిమా చేస్తారనే వార్త‌లు వినిపించాయి. అది కూడా ఒక రూమ‌రే అని తేల‌డంతో రామ్ చ‌ర‌ణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవ‌రితో అనే చ‌ర్చ అభిమానుల్లో మొద‌లైంది.

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ ఖిలాడీ అక్ష‌య్ కుమార్ తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రామ్ చ‌ర‌ణ్ షాకింగ్ విష‌యాల్ని వెల్ల‌డించ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సంద‌ర్భంగా అక్ష‌య్ కుమార్ తో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన రామ్ చ‌ర‌ణ్ త‌న‌కు తెలుగు డైరెక్ట‌ర్ల‌తో మాత్ర‌మే క‌లిసి ప‌ని చేయాల‌ని లేద‌ని, గుజ‌రాతీ, బెంగాళీ డైరెక్ట‌ర్ల‌తో కూడా క‌లిసి ప‌ని చేయాల‌ని వుంద‌ని, వారు కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నార‌ని చెప్ప‌డంతో మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నార‌ట‌.

ప్ర‌భాస్ లాంటి స్టార్ హిందీలో సిద్దార్ధ్ ఆనంద్ లాంటి డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోతున్న వేళ చ‌ర‌ణ్ ఏంటీ బెంగాళీ, గుజ‌రాతీ డైరెక్ట‌ర్లు అంటున్నాడేంట‌ని వాపోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమాని పూర్తి చేసే ప‌నిలో వున్నాడు. న్యూజిలాండ్ లో పాట చిత్రీక‌ర‌ణ కోసం వెళుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.