Begin typing your search above and press return to search.

ఆస్తుల‌న్నీ పోగొట్టుకున్నాను

By:  Tupaki Desk   |   20 May 2022 2:01 AM GMT
ఆస్తుల‌న్నీ పోగొట్టుకున్నాను
X
టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మెన్ గా డా. రాజ‌శేఖ‌ర్ కు మంచి పేరు, ఇమేజ్ వుంది. అయితే గ‌త కొంత కాలంగా త‌న మార్కు సినిమాల‌తో ఆక‌ట్టుకోవాల‌ని మ‌ళ్లీ అందరిలాగే ట్రాక్ లోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న ఆస్తుల్ని కూడా పోగోట్టుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే తాజాగా వెల్ల‌డించారు. డా. రాజ‌శేఖ‌ర్ న‌టించిన తాజా చిత్రం `శేఖ‌ర్‌`. జీవితా రాజ‌శేఖ‌ర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 20న శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `జోసెఫ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు.

రాజ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె శివాని రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప్ర‌కాష్ రాజ్, ఆత్మీయ రంజ‌న్‌, జార్జిరెడ్డి ఫేమ్ ముస్కాన్ , అభిన‌వ్ గోమ‌ఠం న‌టించారు. ఈ చిత్రంపై డా. రాజ‌శేఖ‌ర్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ సంద‌ర్భంగా డా. రాజ‌శేఖ‌ర్ ప‌లు ఆస‌క్తిక విష‌యాల్ని మీడియాకు వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ఆస్తులు పోగొట్టుకున్నాన‌ని, అప్పుల్లో వున్నాన‌ని తెలిపారు. ఇక శేఖ‌ర్ రిలీజ్ స‌మ‌యంలో టెన్ష‌న్ ప‌డుతున్నాన‌ని, ఈ సినిమా పైనే ఆశ‌లు పెట్టుకున్నాన‌న్నారు.

ఈ సినిమాని ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌క‌ముంది. నేను ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప్రేక్ష‌కుల్ని నిరాశ ప‌ర‌చ‌న‌ని మాటిస్తున్నాను. ఈ మూవీని థియేట‌ర్ల‌లో మాత్ర‌మే చూడండి` అన్నారు. అయితే ఈ సినిమా అనుక‌న్న‌ప్పుడు త‌న‌కు క‌రోనా సోకింద‌ని నిర్ధార‌ణ అయింద‌న్నారు. దీంతో ఈ మూవీని నేను చేయ‌లేన‌ని, రీమేక్ రైట్స్ అమ్మేయ‌మ‌ని జీవిత‌కు చెప్పాన‌న్నారు. నేను మ‌ళ్లీ పూర్తిగా కోలుకుని మునుప‌టిలా న‌టించ‌లేన‌ని చెప్పార‌ట‌. అయితే జీవిత మాత్రం సాధార‌ణ స్థితికి వ‌స్తార‌ని, మ‌ళ్లీ న‌టిస్తార‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో చెప్పార‌ట‌. అయితే త‌ను అన్న‌ట్టుగానే క‌రోనా నుంచి తాను పూర్తిగా కోలుకున్నాన‌ని. అందుకు పూర్తిగా శివాని, శివాత్మిక స‌హ‌క‌రించార‌న చెప్పుకొచ్చారు రాజ‌శేఖ‌ర్‌.

ఇక సినిమా ప్రారంభం అయ్యాక జీవిత సెట్ లో ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించిందని, షాట్ న‌చ్చ‌క‌పోతే మ‌ళ్లీ రీ టేక్ అని అడిగిన సంద‌ర్భాలు కూడా వున్నాయ‌న్నారు. అంతే కాకుండా రీటేక్ స‌మ‌యంలో బంగారం అంటూ త‌న‌ని కూల్ చేసేద‌ని చెప్పుకొచ్చారు. ఇక కూతురు పాత్ర కోసం శివానిని తీసుకోవాలా? శివాత్మిక‌ని తీసుకోవాలా? అని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డామ‌న్నారు. ఫైన‌ల్ గా శివాని ని ఫైన‌ల్ గా ఎంచుకున్నామ‌ని, శివాత్మిక త‌న‌తో మ‌రో సినిమాలో న‌టించాల‌నుకుంటోంద‌ని తెలిపారు.

ఇక సాయి కుమార్ చాలా కాలం త‌రువాత నా పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పాడ‌న్నారు. `శేఖ‌ర్‌` సినిమా విజ‌యంపై టీమ్ అంతా మంచి కాన్ఫిడెన్స్ తో వున్నామ‌ని, ఈ సినిమా ఖ‌చ్చితంగా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంద‌ని. ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఈ మూవీ కోసం థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని డా. రాజ‌శేఖ‌ర్ ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. త‌న కెరీర్ ఈ సినిమాపై ఆధార‌ప‌డి వుండ‌టంతో రాజ‌శేఖ‌ర్ శుక్ర‌వారం ఈ మూవీ ఫ‌లితం కోసం చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయ‌న న‌మ్మ‌కాన్ని `శేఖ‌ర్‌` నిల‌బెడుతుందా అన్న‌ది మ‌రి కొన్ని గంట‌ల్లో తేల‌బోతోంది.