Begin typing your search above and press return to search.

ట్విట్టర్లో గాళ్‌ ఫ్రెండును పరిచయం చేసిండు

By:  Tupaki Desk   |   13 Feb 2018 11:35 PM IST
ట్విట్టర్లో గాళ్‌ ఫ్రెండును పరిచయం చేసిండు
X
ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ ఏ చిన్న విషయం గురించి చెప్పాలన్నా కూడా.. సోషల్ మీడియా ద్వారా కన్వే చేస్తున్నారు. అలా చెప్పేస్తే వెంటనే లక్షలాది మంది అభిమానులకు క్లారిటీ వచ్చేస్తుందని వారి నమ్మకం. అదిగో ఇప్పుడు పెళ్ళిచూపులు ఫేం కమెడియన్ ప్రియదర్శి కూడా సేమ్ అదే తరహాలో తన ప్రేమ వ్యవహారాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిండు.

మనోడు రిచా శర్మ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట. ఆ విషయాన్ని వేరే రకంగా చెబుతూ.. నిన్న ఆ అమ్మాయి పుట్టినరోజును పురస్కరించుకుని.. డియర్ లవ్ అంటూ ఒక ప్రేమలేఖ రాశాడు. అదిలో తన డార్లింగ్ రిచా గురించి చెప్పాడు. ఆ విధంగా తన ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేశాడు ఈ టాలెంటెడ్ నటుడు. మొన్న వచ్చిన తొలిప్రేమ సినిమాలో ఇరగదీసి.. ఇప్పుడు ప్రేమికుల రోజుకు ఒక్క రోజు ముందు తన ప్రేమను ప్రపంచానికి పరిచయం చేసి.. తన ప్రేయసి ఫోటోను కూడా షేర్ చేసి.. ఓ మాంచి ప్రేమికుడు అనిపించుకుంటున్నాడు ప్రియదర్శి. కాదంటారా?

ఇకపోతే ఫిబ్రవరి 23న ప్రియదర్శి మరియు రిచా శర్మల పెళ్ళి హైదరాబాదులో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అది సంగతి.