Begin typing your search above and press return to search.

నో పుష్ప‌... ఫైర్ అంటేనే అల్లు అర్జున్

By:  Tupaki Desk   |   20 Dec 2021 11:30 AM GMT
నో పుష్ప‌... ఫైర్ అంటేనే అల్లు అర్జున్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప : ది రైజ్‌`. వెబ్ సిరీస్ గా చేయాల‌ని ముందు ప్లాన్ చేసిన క‌థ‌ని రెండు బాగాలుగా ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా `పుష్ప : ది రైజ్‌` ఈ నెల 17న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఈ ఏడాది విడుద‌లైన చిత్రాల్లో అత్య‌ధిక వాసూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా పుష్ప సరికొత్త రికార్డుని నెల‌కొల్పింది.

తొలి రోజు అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి వ‌ర‌ల్డ్ వైడ్ గా 71 కోట్ల‌ని వ‌సూలు చేసింది. రెండ‌వ రోజు కూడా అదే జోరుని చూపించి ఏకంగా 45 కోట్లు కొల్ల‌గొట్టింది. దీంతో రెండు రోజుల్లోనే 116 కోట్ల గ్రాస్ ని సాధించిన చిత్రంగా నిలిచి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. దీంతో ఈ సినిమాపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. మ‌రీ ముఖ్యంగా పుష్ప‌రాజ్ పాత్ర‌లో న‌టించిన బ‌న్నీపై ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్, మెగాస్టార్ చిరంజీవి, స‌మంత‌.. ఇలా ఇంస్ట్రీకి చెందిన ప‌లువురు బ‌న్నీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమాని, యంగ్ హీరో నితిన్ చేరారు. తాజాగా `పుష్ప‌` మూవీని చూసిన నితిన్ సినిమాలో బ‌న్నీ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా పొగిడేస్తూ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. గ‌తంలో ఎన్న‌డూ ఈ త‌ర‌హాలో ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేయ‌ని నితిన్ ప్ర‌త్యేకంగా `పుష్ప‌` సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది,

`పుష్ప‌`లో అల్లు అర్జున్ డార్లింగ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. పుష్ప అంటే ఫైర్ కాదు. అల్లు అర్జున్ అంటేనే ఫైర్. ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశాను. సుకుమార్‌, ర‌ష్మిక‌, డీఎస్పీకి ఇంఆక సినిమా టీమ్ కి అభినంద‌న‌లు` అంటూ అల‌లు అర్జున్ ని హ‌గ్ చేసుకున్న ఫొటోని షేర్ చేశాడు నితిన్‌. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

`భీష్మ‌` స‌క్సెస్ తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన నితిన్ ఆ త‌రువాత వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటితో చేసిన `చెక్‌`, యంగ్ డైరెక్ట‌ర్ తో చేసిన `రంగ్‌దే`, బాలీవుడ్ హిట్ `అంధాధున్` ఆధారంగా చేసిన `మాస్ట్రో` చిత్రాలు ఆశించిన ఫ‌లితాల్ని అందించ‌లేక‌పోయాయి. `రంగ్ దే` కొంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేద‌నిపించినా నితిన్ కు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బ్లాస్టింగ్ హిట్ అవస‌రం. దీంతో ప్ర‌స్తుతం చేస్తున్న `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం` సినిమాపై నితిన్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.