Begin typing your search above and press return to search.

పొగకు నేనెంతో దూరం

By:  Tupaki Desk   |   31 May 2017 8:21 AM GMT
పొగకు నేనెంతో దూరం
X
యంగ్ హీరోల్లో వరస హిట్లతో మంచి ఊపుమీదున్నాడు నిఖిల్. తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రిలీజైన కేశవ సినిమా చెప్పుకోదగిన కలెక్షన్లే రాబట్టింది. డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకోవడమే నిఖిల్ కు ప్లస్ పాయింటవుతోంది. తాజాగా రిలీజైన కేశవ రొటీన్ రివెంజ్ స్టోరీయే అయినా గుండె కుడివైపున ఉండటం అన్న ప్రోమో జనాలకు బాగానే కనెక్ట్ అయింది. దీంతో బాహుబలి థియేటర్లలో ఉన్న సమయంలోనూ ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు బాగానే వచ్చారు.

కేశవ విజయయాత్రలో భాగంగా ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్ర యూనిట్ పర్యటించింది. ఈ యాత్ర పూర్తి చేసుకుని నిఖిల్ హైదరాబాద్ కు తిరిగొచ్చాడు. వచ్చిన వెంటనే యాంటీ టొబాకో క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా నిర్వహించిన ఈ క్యాంపెయిన్ లో పాల్గొని ‘సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇన్జూరియస్ టు హెల్త్’ అనే నినాదాన్ని గుర్తు చేశాడు. తాను సిగరెట్ తాగనని.. పొగాకుకు దూరంగా ఉంటానని చెప్పాడు. తన సినిమాల్లో కూడా సిగరెట్ తాగడాన్ని ప్రోత్సహించనని ప్రతిజ్ఞ కూడా చేశాడు,

సాధారణంగా సినిమాల్లో హీరోనో, విలనో సిగరెట్ తాగడాన్ని ఓ స్టయిల్ గా ప్రమోట్ చేస్తుంటారు. ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ కింద ఓ క్యాప్షన్ వేసి తమ పని తాము చేసుకుంటూ పోతారు. పొగాకు, గుట్కాకు దూరంగా ఉండమంటూ క్యాప్షన్లతో సరిపెట్టకుండా జనాల్లో చైతన్యం పెంచే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/