Begin typing your search above and press return to search.

'కార్తికేయ 3' పై నిఖిల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   16 Oct 2022 1:30 PM GMT
కార్తికేయ 3 పై నిఖిల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌!
X
సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తున్న హీరో నిఖిల్‌. `హ్యాపీడేస్‌`తో ప‌రిచ‌య‌మైన నిఖిల్ త‌న‌దైన పంథాలో సినిమాల‌ని ఎంచుకుంటూ హీరోగా వ‌రుస విజ‌యాల్ని ద‌క్కించుకుంటూ త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నాడు. రీసెంట్ గా `కార్తికేయ 2`తో ఊహించ‌ని విధంగా పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకుని ఆశ‌ర్య‌ప‌రిచాడు. చిన్న సినిమాగా విడుద‌లైన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రూ. 100 కోట్ల‌కు మించి వసూళ్ల‌ని రాబ‌ట్టి ఔరా అనిపించింది.

చందూ మొండేటి డైరెక్ష‌న్ లో అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఉత్త‌రాదిలో రూ. 30 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి నిఖిల్ సినిమాల్లో స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుని ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురిచేసింది. ఈ సినిమాలో అఖిల్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఈ మూవీకి సీక్వెల్ గా `కార్తికేయ 3`ని కూడా చేయ‌బోతున్నార‌ట‌. దీనిపై ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ హీరో నిఖిల్ తాజాగా ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించాడు. `కార్తికేయ‌` తీస్తున్న‌ప్పుడు దానికి సీక్వెల్ చేయాల‌నుకోల‌ద‌న్నాడు. అంతే కాకుండా తాను ఎక్క‌డికి వెళ్లినా `కార్తికేయ 2` ఎప్పుడు తీస్తున్నార‌ని అడిగే వార‌ట‌. ఇప్ప‌డు `కార్తికేయ 3` గురించి కూడా అలాగే అడుతున్నార‌ని నిఖిల్ స్ప‌ష్టం చేశాడు. ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని తెలియజేశాడు.

ఒక వేళ నేను `కార్తికుయ 3` చేయ‌క‌పోతే అభిమానులు ఏమంటారో తెలియ‌దు కానీ మా అమ్మా మాత్రం న‌న్ను వ‌ద‌ల‌దు`. అన్నాడు నిఖిల్‌. ఇదే సంద‌ర్భంగా `RRR` ఆస్కార్ పై స్పందించాడు. ఇటీవ‌ల విడుద‌లైన `RRR`, `ది క‌శ్మీర్ ఫైల్స్` నా మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌ర‌య్యాయి. ఆ సినిమాల‌కు ఆస్కార్ వ‌స్తే సంతోష‌మే. కానీ అదే ముఖ్య‌మైంది కాదు. ఎందుకంటే ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాలు గొప్ప‌వి` అని వివ‌రించాడు నిఖిల్‌. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.