Begin typing your search above and press return to search.

కొత్త పాత్రలోకి దూకనున్న నరేష్

By:  Tupaki Desk   |   22 Jun 2018 4:21 AM GMT
కొత్త పాత్రలోకి దూకనున్న నరేష్
X
ఇండస్ట్రీలోకి రచయితలుగా అడుగుపెట్టి ఇక్కడ వచ్చిన గుర్తింపుతో నటులుగా.. డైరెక్టర్లుగా చాలామందే పేరు తెచ్చుకున్నారు. తనికెళ్ల భరణి.. ఎల్.బి. శ్రీరాం.. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లు నటులుగా పేరు తెచ్చుకుంటే కొరటాల శివ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్లు డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. కానీ నటుడిగా గుర్తింపు వచ్చాక పెన్ను పట్టుకుని రైటర్ గా మారిన వాళ్లు చాలా తక్కువ మందే.

ఇదే విధంగా ఇప్పుడో సీనియర్ నటుడు రచయితగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఆయనే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి జోష్ మీదున్న నరేష్. ఈ మధ్య నరేష్ ఓ స్టోరీ రాయడం మొదలుపెట్టాడట. ఇప్పటికే టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్ ను కలిసి తన స్టోరీ కాన్సెప్ట్ గురించి నెరేట్ చేశాడని తెలుస్తోంది. నరేష్ చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ ఈ కథతో సినిమా తీయడానికి ఓకే చెప్పాడనేది లేటెస్ట్ టాక్.

నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి చాలాకాలమే అయినా ఈమధ్య వచ్చిన శతమానం భవతి.. అఆ సినిమాలు ఆయనలోని మంచి నటుడిని ప్రేక్షకులకు చూపించాయి. తాజాగా సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్టన్ లో వచ్చిన సమ్మోహనంలోనూ నరేష్ పాత్ర హైలైట్ గా నిలిచింది.