Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల‌కు ధీటుగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కార‌వాన్‌

By:  Tupaki Desk   |   25 Jan 2022 11:30 PM GMT
స్టార్ హీరోల‌కు ధీటుగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కార‌వాన్‌
X
కార‌వాన్ లు స్టార్ హీరోల‌కు చాలా ప్ర‌త్యేకం. ఎక్క‌డో సెట్లో షూటింగ్ చేస్తుంటే అక్క‌డ కూడా తాము అనుకున్న స‌దుపాయాల్ని పొంద‌డం మ‌న స్టార్ హీరోల‌కు అల‌వాటుగా మారింది. అందుకు వారు ఎంచుకున్న సాధ‌నం కార‌వాన్‌. ఇందులో స‌క‌ల సౌక‌ర్యాల‌నూ ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఇంద కోసం భారీగానే ఖ‌ర్చు చేస్తున్నారు. బ‌న్నీ త‌న కార‌వాన్ కోసం ఏకంగా కోట్లు ఖ‌ర్చు చేశారు దీంతో అది టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

స్టార్ హీరోల‌కు మాత్ర‌మే ప‌రిమితం అనుకున్న ఈ కార‌వాన్ ల‌ని ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు కూడా వాడుతున్నారు. స్టార్ హీరోల త‌ర‌హాల‌నే ఇండ‌స్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ బిజీగా వున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు ప్ర‌త్యేకంగా కార‌వాన్ ల‌ని వాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ తాజాగా ఖ‌రీదు చేసిన ల‌గ్జ‌రీ కార‌వాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గ‌తంలో న‌రేష్ హీరోగా న‌టించి హాస్య ప్ర‌ధాన చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారి వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్న ఆయ‌న క్ష‌ణం తీరిక‌లేకుండా గ‌డుపుతున్నారు. న‌రేష్ ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం వున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌త్యేకంగా సొంత కార‌వాన్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత కాలం సెట్ చాలా మందితో క‌లిసి కార‌వాన్ ని వినియోగించుకున్న న‌రేష్ స్వంతంగా తన కోస‌మే కార‌వాన్ ని కొనుగోలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా వేవే వాళ్ల కార‌వాన్ వాడ‌టం మంచిది కాద‌ని భావించిన న‌రేష్ ప్ర‌త్యేకంగా ఓ కార‌వాన్ ని కొనుగోలు చేశారు. ఇందులో ఏసీ బెడ్‌, మేక‌ప్ ప్లేస్‌, జిమ్‌, వెయిటింగ్ రూమ్‌, వాష్ రూమ్ తో స‌హా స‌క‌ల సౌక‌ర్యాలు ఉన్నాయ‌ట‌. ఈ వ్యాన్ ని ఆయ‌న ముంబై నుంచి తెప్పించార‌ని తెలిసింది. దీని కోసం న‌రేష్ భారీ మొత్త‌మే చెల్లించారని ఇండ‌స్ట్రీ టాక్‌.

ఇప్ప‌టి వ‌ర‌కు సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల‌కు ప్ర‌త్యేకంగా అంటూ కార‌వాన్ లేదు. నిర్మాత ఏర్పాటు చేసిన కార‌వాన్ నే ఇద్ద‌రు లేదా ముగ్గురు క‌లిసి వాడుకునేవార‌ట‌. దానికి ఫుల్ స్టాప్ పెట్టిన న‌రేష్ తానే సొంతంగా కార‌వాన్ ని ఏర్పాటు చేసుకోవ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.