Begin typing your search above and press return to search.

గాయ‌ని తో న‌టుడి మార్ఫింగ్ ఫోటో వైర‌ల్

By:  Tupaki Desk   |   16 Nov 2019 9:59 AM GMT
గాయ‌ని తో న‌టుడి మార్ఫింగ్ ఫోటో వైర‌ల్
X
ఇంట‌ర్నేష‌న‌ల్ సెన్సేష‌న్.. అమెరిక‌న్ పాప్ స్టార్ కేటీ పెర్రీ ముంబై ప‌ర్య‌ట‌న గురించి తెలిసిందే. ఈ ఆదివారం లైవ్ మ్యూజిక్ కాన్సెర్టు తో కేటీ ఇండియ‌న్ ఫ్యాన్స్ కి అదిరి పోయే ట్రీటివ్వ‌బోతోంది. ఈలోగానే ముంబై లో మీడియా స‌మావేశాలు.. పార్టీలు అంటూ ఈ పాప్ గాయ‌ని చేస్తున్న సంద‌డి ప్ర‌ముఖం గా చ‌ర్చ‌ కు వ‌చ్చింది.

ఇంత‌కు ముందు బాలీవుడ్ ద‌ర్శ‌క‌ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కేటీ కోసం అదిరి పోయే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ లో బాలీవుడ్ టాప్ స్టార్లు పాల్గొని త‌న‌తో ఫోటోలు దిగిన సంగ‌తి తెలిసిందే. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం అంత‌ర్జాలం లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఆ క్ర‌మం లోనే కేటీ పెర్రీతో క‌మెడియ‌న్ సునీల్ గ్రోవ‌ర్ క‌లిసి ఉన్న ఓ ఫోటో ఒక‌టి మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో లో కేటీని హ‌త్తుకున్నంత ద‌గ్గ‌ర‌గా ఫోజిచ్చి క‌నిపిస్తున్నాడు సునీల్ గ్రోవ‌ర్. ఫ్యాన్స్ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్న ఈ ఫోటో మార్ఫ్ డ్ ఫోటో కావ‌డం తో దీని పై ఒక్కొక్క‌రు ఒక్కోలా ఫ‌న్నీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఈ మార్ఫింగ్ ఫోటో ని సునీల్ గ్రోవ‌ర్ స్వ‌యంగా షేర్ చేసి దానికో క్యాప్ష‌న్ ఇచ్చాడు. ``అంద‌రిలానే కేటీతో నేను కూడా ఫోటో దిగాను. త‌ను చాలా విన‌య‌విధేయ‌త‌లు తెలిసిన గాయ‌ని`` అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. దీనిపై అభిమానులు ఒక్కొక్క‌రూ ఒక్కోలా స్పందించారు. సునీల్ గ్రోవ‌ర్ పై బాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీ లు స‌ర‌దా కామెంట్లు చేశారు.

టాప్ బ్యూటీ క‌త్రిన కైఫ్ సైతం ఈ ఫోటో పై స్పందిస్తూ... కొన్ని లాఫింగ్ ఈమోజీల్ని షేర్ చేసింది. భార‌త్ చిత్రంలో క‌త్రిన - సునీల్‌ గ్రోవ‌ర్ క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే క‌మెడియ‌న్ గౌర‌వ్ గెరా.. నిర్మాత అతుల్ అగ్నిహోత్రి కూడా ఆ మార్ఫ్ డ్ ఫోటోపై కామెంట్లు పోస్ట్ చేశారు. సునీల్ గ్రోవ‌ర్ పేరు ఇంత‌కు ముందు ర‌క‌ర‌కాల వివాదాల‌ తోనూ పాపుల‌రైంది. ప్ర‌ఖ్యాత క‌పిల్ శ‌ర్మ టాక్ షోతో సునీల్ గ్రోవ‌ర్ పాపుల‌ర‌య్యారు. ఆ త‌ర్వాత క‌పిల్ శ‌ర్మ‌తో ఘ‌ర్ష‌ణ ప‌డి అత‌డు ఆ షోకి దూర‌మైన సంగ‌తి తెలిసిందే.