Begin typing your search above and press return to search.
అభిమాని మరణం.. బోరుమని ఏడ్చేసిన కార్తి
By: Tupaki Desk | 27 Dec 2017 12:40 PM ISTమనల్ని ఎంతగానో అభిమానించే వ్యక్తులు చనిపోతే ఉండే బాధే వేరు. తమిళ స్టార్ హీరో కార్తి ఇప్పుడు అలాంటి బాధతోనే బోరుమన్నాడు. అతను తన అభిమాని మరణాన్ని తట్టుకోలేక గట్టిగా ఏడ్చేశాడు. జీవన్ కుమార్ అనే కార్తి అభిమాని నిన్న జరిగిన ఓ కారు ప్రమాదంలో చనిపోయాడు. జీవన్ కార్తికి వీరాభిమాని. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా కార్తి అభిమానుల సంఘానికి అతను అధ్యక్షుడు కూడా. కార్తి మీద పలు సందర్భాల్లో వీరాభిమానాన్ని చాటుకున్న జీవన్.. తన అభిమాన కథానాయకుడికి వ్యక్తిగతంగానూ చేరువయ్యాడు. కార్తికి కూడా జీవన్ బాగా తెలుసు.
మూడు నెలల కిందట అతడి పెళ్లికి కూడా కార్తి హాజరయ్యాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. జీవన్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన కార్తి తీవ్రంగా కలత చెందాడు. బుధవారం తిరువన్నామలైలో జీవన్ అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా కార్తి బోరుమని ఏడ్చేయడం ఒకింత ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టే జీవన్ కార్తికి ఎంత సన్నిహితుడో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఓ అభిమాని కోసం హీరో ఏడవడం అరుదైన విషయమే. జీవన్ వయసు 27 ఏళ్లు మాత్రమే. మూడు నెలల కిందట కార్తి తన పెళ్లికి హాజరైనపుడు పెళ్లి దుస్తుల్లో అతను కార్తిని హత్తుకుంటూ ముద్దు పెడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.