Begin typing your search above and press return to search.

ల‌క్ష‌తో మొద‌లై 20 కోట్లు అందుకున్న ఏకైక స్టార్!

By:  Tupaki Desk   |   2 May 2022 8:00 AM IST
ల‌క్ష‌తో మొద‌లై 20 కోట్లు అందుకున్న ఏకైక స్టార్!
X
ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఊర‌క‌నే అన‌రు. ఆ ఒక్క ఛాన్స్ వ‌చ్చి స‌క్సెస్ అందుకేంటే రాత్రికి రాత్రే స్టార్ అయిపోతారు. పేరుకే పేరు..డ‌బ్బుకి డ‌బ్బు ..స‌క‌ల సౌక‌ర్యాలు దొరుకుతాయి. అది కేవ‌లం సినిమా రంగంలో మాత్ర‌మే. ఇంకే రంగంలో ఈ విధ‌మైన జీవితం ఉండ‌దు. అందుకే ఆ ఒక్క ఛాన్స్ కోసం ఏళ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేస్తారు.

అయితే అలా యాచించాలంటే రంగుల ప్ర‌పంచం అంటే ఎంత మ‌క్కువ..ఫ్యాష‌న్ ఉండాలి. అలా శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నించిన వారికే ఏదో ఒక‌రోజు అలాంటి గొప్ప జీవితం ఉంటుంది. అమితాబ‌చ్చ‌న్..చిరంజీవి ద‌గ్గ‌ర నుంచి నేటి జ‌న‌రేష‌న్ యంగ్ స్టార్స్ వ‌ర‌కూ ఎలాంటి సినీ నేప‌థ్యం లేకుండా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స‌క్సెస్ అయిన ప్ర‌తీ ఒక్క‌రిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లిన వారే రేప‌టి స్టార్ల‌గా మారుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లావత్ కూడా ఒక‌రు. జైదీప్ ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా పనిచేస్తున్నా చాలా సినిమాల్లో సహాయ పాత్రలకే పరిమితమయ్యారు.

చివరగా అతను 2020 వెబ్ సిరీస్ `పాటల్ లోక్‌`లో ప్రధాన పాత్రలో న‌టించి నేడు 20 కోట్ల బిగ్ స్టార్ అయ్యారంటే నమ్ముతారా? మీరు కాని ఇది న‌మ్మాల్సిన నిజం. జైదీప్ ఇప్ప‌టివ‌ర‌కూ బాలీవుడ్ లో చాలా సినిమాల్లో న‌టించారు. కానీ అవేవి ఇవ్వ‌ని గుర్తింపు ఒక్క వెబ్ సిరీస్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో జైదీప్ సంచలన ప్రదర్శన ఇచ్చారు.

దానికి ఫ‌లితంగా అత‌నికి అసాధార‌ణ‌మైన‌ ప్రజాదరణ ద‌క్కింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తొలుత ఈసిరీస్ కోసం రూ.లక్ష రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత 40 లక్షలు అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా మేకర్స్ ఈ సూపర్ హిట్ సిరీస్ యొక్క రెండవ సీజ‌న్ కి 20 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు.

మొదటి సీజన్‌లో సాధించిన దానికంటే 50 రెట్లు అధికంగా అందుకుంటున్నారు. ఈ రేంజ్ రెమ్యున‌రేష‌న్ కి జైదీప్ నూరు శాతం అర్హుడిగా చెప్పొచ్చు . ఇందులో అంత గొప్ప ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు ఆయ‌న‌. `పాటల్ లోక్` సీజన్ 2 ఈ ఏడాది చివర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.