Begin typing your search above and press return to search.

సీతమ్మ లవర్.. అయ్యో పాపం

By:  Tupaki Desk   |   22 Sept 2017 11:29 AM IST
సీతమ్మ లవర్.. అయ్యో పాపం
X
జర్నీ మూవీతో టాలీవుడ్ ఆడియన్స్ కు బాగానే పరిచయం అయ్యాడు హీరో జై. ఆ తర్వాత తెలుగులో పెద్దగా మెరవకపోయినా.. తమిళ్ లో మాత్రం ఈ యంగ్ హీరో కుమ్మేస్తున్నాడు. మరోవైపు టాలీవుడ్ సీతమ్మ అంజలికి రియల్ లైఫ్ ప్రియుడిగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కుర్రాడికి మంచి ఫాలోయింగే దక్కింది.

కానీ ప్రస్తుతం ఈ యంగ్ హీరో టైం అంత బాగున్నట్లుగా కనిపించడం లేదు. సినిమాల సంగతి పక్కన పెడితే.. రియల్ లైఫ్ లో మాత్రం కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. పోలీసు కేసులు నమోదు కావడం అంటే.. నిజంగా బ్యాడ్ టైం అనాల్సిందే. ఇంతకీ అసలేం జరిగిందంటే.. రీసెంట్ గా ఈ రో మండవెలి నుంచి అడయార్ కు తన కారులో జర్నీ చేస్తున్నాడు. ఆ సమయంలో అడయార్ ప్రాంతంలో అడయార్ ఫ్లై ఓవర్ ను తన కారుతో గుద్దేశాడు. శాస్త్రి నగర్ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేసి.. జై పై రెండు కేసులు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణం కావడం ఒక కేసు అయితే.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేశాడంటూ మరో కేసు నమోదు చేశారు పోలీసులు.

అంతే కాదు.. జై కు చెందిన ఆడి కారును కూడా స్వాధీనం చేసుకుని ఎగ్జామినేషన్ కు పంపారు. రీసెంట్ గా వైభవ్ రెడ్డి.. జైలతో కలిసి గోవా పార్ట్ 2 అంటూ ప్రేమ్ జీ అమరెన్ ఓ ఫోటో ట్వీట్ చేశాడు. ఈ ప్రమాదం సమయంలో వారు ఎక్కడ ఉన్నారనే అంశంపై ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.