Begin typing your search above and press return to search.

'పుష్ప' లో నేచురల్ యాక్టర్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర పార్ట్-1 కే పరిమితం..?

By:  Tupaki Desk   |   18 Jun 2021 7:30 AM GMT
పుష్ప లో నేచురల్ యాక్టర్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర పార్ట్-1 కే పరిమితం..?
X
అల్లు అర్జున్ హీరోగా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా ''పుష్ప''. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారని మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఫహాద్ పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది.

అందేంటంటే.. 'పుష్ప' చిత్రంలో ఫహాద్ ఫాజిల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. అది కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే పాత్ర అని అంటున్నారు. అయితే ఫ‌హాద్ రోల్ 'పుష్ప 2' లో ఉండదట. మొదటి భాగానికే పరిమితం అవుతుందట. 'పుష్ప 1' క్లైమాక్స్ లో అతని క్యారక్టర్ చనిపోతుందని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా మలయాళంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న పాజిల్.. ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తుండటం మార్కెట్ పరంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

ఇకపోతే 'పుష్ప' చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - సునీల్ - అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆస్కార్ గ్రహీత రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలసి ఈ చిత్రాన్ని భారీ స్కేల్ లో నిర్మిస్తున్నారు. 'ఆర్య' 'ఆర్య 2' తర్వాత బన్నీ - సుక్కూ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'పుష్ప' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న 'పుష్ప 2' విడుదలపై త్వరలోనే క్లారిటీ రానుంది.