Begin typing your search above and press return to search.
దివ్యా భట్నాగర్ భర్త ఓ సైకో..! సంచలన వ్యాఖ్యలు చేసిన స్నేహితురాలు!
By: Tupaki Desk | 8 Dec 2020 3:02 PM ISTబాలీవుడ్ టీవీ నటి దివ్యా భట్నాగర్ ఇటీవల కరోనా తో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె స్నేహితురాలు దేవోలీనా ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. ‘దివ్యా భర్త.. గగన్ గబ్రూ ఓ సైకో. కేవలం డబ్బుకోసమే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కరోనా వచ్చిందని తెలియగానే ఎక్కడికో వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు, స్నేహితులు ఎంత చెప్పినా వినకుండా దివ్య అతడిని ప్రేమించి పెళ్లిచేసుకున్నది. డబ్బు కోసం గగన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత తరుచూ అతడు డబ్బు కోసం దివ్యాను వేధించేవాడు. పలు మార్లు బలవంతంగా ఆమె బంగారాన్ని లాక్కున్నాడు.
ఆప్పటినుంచి ఆమె మానసికంగా ఎంతో వేదన చెందుతున్నది. కానీ పరువు పోతుందని ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేదు. గగన్ గురించి పెళ్లికిముందే చాలామంది దివ్యకు చెప్పారు. కానీ ఆమె వాటిని సీరియస్‌గా తీసుకొలేదు. మాయమాటలు చెప్పి మోసం చేసిన గగన్ ఆమెను కరోనా రాగానే ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. గగన్పై అనేక కేసులు ఉన్నాయి. అతడిపై లైంగిక ఆరోపణలు కూడా ఉన్నాయి. అందమైన ఆడపిల్లలను మోసం చేయడం లొంగదీసుకోవడం అతడికి వెన్నతోపెట్టిన విద్య. షిమ్లా పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసులు కూడా నమోదయ్యాయి. దివ్యను కూడా ప్రేమించనట్టు నటించి మోసం చేసి పెళ్లిచేసుకున్నాడు. ఆమెకు ఆలోచించుకొనే సమయం కూడా ఇవ్వకుండా వెంటనే పెళ్లిచేసుకున్నాడు.’ అని దేవోలినా ఓ వీడియోను విడుదల చేశారు.
ఆమె దివ్యాకు స్నేహితురాలు. అయితే చిన్న వయసులోనే దివ్యా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ‘ఏ రిషిత క్యా కెహలాతా హై’, ‘సంస్కార్’, ‘ఉడాన్’, ‘జీత్ గయి తొహ్ పియా మోర్రే’ సీరియల్స్‌లో దివ్య నటించి మెప్పించారు.