Begin typing your search above and press return to search.

క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం దక్కలేదు సరే.. క‌నీసం పారితోషికం కూడా అంద‌లేదా..?

By:  Tupaki Desk   |   22 Oct 2022 2:30 AM GMT
క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం దక్కలేదు సరే.. క‌నీసం పారితోషికం కూడా అంద‌లేదా..?
X
టాలీవుడ్ యంగ్ హీరో కెరీర్ ప్రారంభం నుంచి కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. స్వతహాగా దూకుడు స్వభావం కలిగిన అతను మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే జాతీయ స్థాయిలో సత్తా చాటడానికి అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న ఈ హీరోకి.. నిరాశే మిగిలింది.

ఇటీవల యువ హీరో ఓ స్టార్ డైరెక్టర్ తో భారీ ప్రాజెక్ట్ చేశాడు. దీని కోసం అతను ఎంత చేయాలో అంతా చేసాడు. కాకపోతే క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం రాలేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఒక్కసారిగా హీరో చుట్టూ నెగెటివిటీ వచ్చి చేరింది.

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. ఒక్కసారి ఫెయిల్యూర్ పలకరిస్తే అంతకుముందు మాట్లాడిన మాటలు కూడా మనకు ప్రతికూలంగా మారుతాయి. ఇప్పుడు ఆ హీరో విషయంలో అదే జరిగింది. కార‌ణాలు ఏవతేనేం ఇప్పుడు అతని దూకుడికి కాస్త బ్రేక్ పడింది.

ఇకపోతే హీరో క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం రాలేదని బాధ పడుతుంటే.. క‌నీసం అతనికి పారితోషికం కూడా అంద‌లేదనే టాక్ ఇప్పుడు నడుస్తోంది. నిజానికి ఆ సినిమా కోసం హీరో చాలా త‌క్కువ మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నాడట. బిజినెస్ అంతా పూర్తైన తర్వాత ఫుల్ రెమ్యునరేషన్ తీసుకునేలా అగ్రిమెంట్ రాసుకున్నారట.

అయితే సినిమాకి మాంచి క్రేజ్ రావడంతో.. ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీంతో నిర్మాతలకు మద్దతుగా సినిమా అంతా కంప్లీట్ అయ్యాకే పారితోషకం తీసుకుంటానని చెప్పాడట. అదే హీరోపై దెబ్బ పడేలా చేసిందని అంటున్నారు.

ఓటీటీ రైట్స్ ద్వారా వ‌చ్చే డ‌బ్బులను హీరోకి పారితోషికంగా ఇవ్వాలని మేకర్స్ ప్లాన్‌ చేసుకున్నారట. అయితే సినిమా విడుదలకు ముందు ఆర్థిక‌ప‌ర‌మైన ఇబ్బందులు రావడంతో.. డిజిటల్ హక్కులతో అన్నీ క్లియర్ చేసుకున్నారట. సినిమా హిట్టయితే అన్నీ సెట్ అవుతాయిలే అనుకున్నారట.

కానీ తీరా చూస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. థియేట్రికల్ నుంచి రావాల్సిన డబ్బులు రాలేదు. పైగా కొందరు బయ్యర్లకు కొంత మొత్తంలో సెటిల్ చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు హీరోకి రావాల్సిన రెమ్యునరేషన్ కూడా ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. దర్శక నిర్మాతలతో ఏర్పడిన స్నేహం కారణంగా హీరో ఏమీ అడగలేక‌పోతున్నాడట.

ఈ సినిమా కోసం హీరో ఎంత హార్డ్ వర్క్ చేసాడో.. ఎన్నేళ్ళు సమయం కేటాయించడనేది అందరికీ తెలుసు. కానీ అంత కష్ట పడ్డా సినిమాలో విషయం లేకపోవడంతో.. పరాజయం ఎదురైంది. పోనీ పారితోషికం అన్నా దక్కిందిలే అనుకుంటుంటే.. అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల అతనికి ముట్టింది ఏమీ లేదని అంటున్నారు. మరి త్వరలోనే ఆ నిర్మాతలు హీరో రుణాన్ని తీర్చుకుంటారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.