Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ ఎఫెక్ట్: సినీ ప్రముఖులే అల్లాడుతుంటే సామాన్యుల గతేంటి?
By: Tupaki Desk | 14 May 2020 2:00 PM ISTకరోనా కథలు అన్నీ ఇన్నీకావు.. ప్రపంచాన్ని గుప్పిట పెట్టి లాక్ డౌన్ పేరిట అందరినీ ఇంట్లో కూర్చుండబెట్టిన ఘనత దాని సొంతం.. ప్రపంచంలోని అన్ని పనులు ఆగిపోయాయి. సినిమాలు,షికార్లు, ఉద్యోగాలు, ఉపాధి మొత్తం బంద్ అయిపోయింది. జనాలంతా ఇంట్లోనే ఉంటూ కరోనా రోజులను లెక్కబెట్టుకుంటున్నారు.
కరోనా - లాక్ డౌన్ వల్ల కోట్ల మంది ఉపాధి పోయింది. ఉద్యోగాలు కోల్పోయారు. ఉన్న వారికి జీతాలు కట్. కొందరికీ అసలే ఇవ్వడం లేదు. సినిమా షూటింగ్ లు బంద్ అయ్యి సినీ కార్మికులు రోడ్డునపడ్డారు. వారికి ఉపాధి కరువైంది. ఇక చిన్నా చితక నటులు షూటింగ్ లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టాలీవుడ్ లో ఓ మోస్తారు ప్రముఖ నటుడు కూడా లాక్ డౌన్ పొడిగింపు పై తాజాగా తన భయాన్ని ఆందోళనను వ్యక్తం చేశాడు. టాలీవుడ్ సినీ నటుడు బ్రహ్మాజీ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ‘లాక్ డౌన్ పొడిగిస్తే పేదలు, మధ్యతరగతి వాళ్లే కాదు.. తమకు కూడా చిప్పే గతి’ అంటూ చేతిలో చిప్ప పట్టుకొని కూర్చున్న తన ఫొటోను బ్రహ్మాజీ షేర్ చేశాడు.
బ్రహ్మాజీ చిన్నా చితక నటుడేం కాదు.. పేరు మోసిన వాడే.. అప్పట్లో హీరోగాను చేశాడు. హీరోల పక్కన మెయిన్ రోల్స్ చేస్తుంటాడు. అంతటి నటుడే లాక్ డౌన్ పొడిగిస్తే అడుక్కుతినడమే అని అనడం నెటిజన్లను షాక్ కు గురిచేసింది. ఇంతటి సెలెబ్రెటీయే ఇలా అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు కామెంట్ల రూపంలో బ్రాహ్మాజీని ప్రశ్నించారు. కొందరైతే ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఏం వెనుకేసుకోలేదా అని కౌంటర్ ఇచ్చారు. ఇక మరికొందరు అయితే ‘కోట్లు సంపాదించిన మీరు ఇలా అంటే సామాన్యులు ఏమనాలి? సరే వచ్చే నెల కూడా కొనసాగితే చిప్ప ఎత్తుకొని పోవడమే’ అంటూ నీరుగార్చే కామెంట్స్ చేశారు.
కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడున్న టైంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ కాదు.. బతికుంటే బలుసాకు తిని బతికొచ్చు. కానీ ప్రాణం పోతే ఎంత సంపాదించినా వేస్టే కదా.. ఒక్కసారి బయటకు తలుపులు తీస్తే పరిస్థితి ఊహించలేం. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండే బ్రహ్మాజీ లాంటి నటులు కామెడీకి పెట్టారో..లేక నిజంగానే పరిస్థితి ఉందేమో కానీ ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టారు. నటుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతి చెప్పడానికే భయానకంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సమయంలో సెలెబ్రెటీలు ప్రజలకు భరోసా కల్పించేలా పోస్టులు పెడితే మనోధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది. కానీ వారే ‘చిప్ప చేతిలో పట్టుకొని నిలబడితే’ ఇక ప్రజల్లో మరింత నిరాశ నైరాశ్యాలు కమ్ముకుంటాయి. బ్రహ్మాజీ కామెడీగా రియాక్ట్ కావడం వరకు ఓకే.. కానీ అది ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపిస్తుందన్నది కూడా ఆలోచించాలి.