Begin typing your search above and press return to search.

మెగా స్టార్ జీవితకథ తీస్తాను

By:  Tupaki Desk   |   19 July 2017 7:48 AM GMT
మెగా స్టార్ జీవితకథ తీస్తాను
X
మన తెలుగులో రియల్ స్టోరీస్ ఆధారంగా సినిమాలు చాల తక్కువ. ఇప్పుడుప్పుడే అటువంటి సినిమాలు రావడం ఆరంభం అవుతుంది. గొప్పవారి జీవిత కథలు ఇంత వరకు పుస్తకాలు రూపంలోనే మనకు దొరికేవి. డిజిటల్ యుగం పుణ్యమాని అవి టి‌విలలో సినిమాలలో కూడా డ్రామాగా మార్చి మరింతమందికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారు మన సినిమా వాళ్ళు.

తెలుగులో అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు అప్పటిలో వచ్చి ఒక సంచలనమే సృష్టించింది. ఆ తరవాత మళ్ళీ మన తెలుగు సినిమా అటు వైపుగా పయనం సాగించలేదు మళ్ళీ ఇప్పుడు అటువంటి సినిమాలుకు అనువైన కాలంగా అనిపిస్తుంది. మహానటి సావిత్రి పై ఇప్పటికే సినిమా నిర్మిస్తున్నారు. కొద్ది రోజులు కిందటే సీనియర్ ఎన్టీఆర్ పై కూడా సినిమా తీయబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. అలాగే పుల్లెల గోపిచంద్ సినిమా కూడా వస్తోంది. ఇప్పుడు మరో లెజండరీ హీరో జీవిత కథ నిర్మిస్తే బాగుంటుంది అని ఒక సీనియర్ నటుడు బెనర్జీ అభిప్రాయపడ్డాడు.

తెలుగు నటుడు బెనెర్జీ నటించిన సినిమాలు సుమారుగా 300 పై గా ఉంటాయి. ఒక మీడియా ఇంటర్వ్యూ లో బెనెర్జీ ఇలా తన అభిప్రాయాన్ని చెప్పాడు. “తెలుగు సినిమాలో ఒక అలలా వచ్చి పెద్ద కేరటంలా మారిన మెగాస్టార్ చిరంజీవి జీవిత కథను సినిమాగా నిర్మిస్తే చాల బాగుంటుంది. చిరంజీవి నట ప్రయాణం రాబోతున్న నటులుకే కాదు ఏ రంగంలో ఉన్నవారికైనా అతని జీవితం మంచి పాఠంగా ఉంటుంది'' అని చెప్పాడు. అలా అంటూనే మెగాస్టార్ జీవిత కథలో చిరంజీవే హీరోగా ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పాడు. చిరంజీవి గారు ఒప్పుకుంటే నేను ఆ సినిమాను డైరెక్ట్ చేయడానికి కూడా సిద్దంగా ఉన్నాను అని చెప్పాడు. నా తొలి రోజులలో చాల సినిమాలుకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాను అని అన్నాడు.

అభిమానంతో అలా అన్నాడో లేక ఏదో వ్యాపార మర్మం తెలిసి అన్నాడో కానీ చిరంజీవి మీద సినిమా అనే కొత్త టాపిక్ లేవనెత్తాడు బెనర్జీ.