Begin typing your search above and press return to search.

ఈ భద్రం గిఫ్టులిచ్చాడు చూశారా

By:  Tupaki Desk   |   25 Aug 2017 5:17 AM GMT
ఈ భద్రం గిఫ్టులిచ్చాడు చూశారా
X
మాంచి ట్యాలెంట్ ఉన్న ఆర్టిస్టులను వెతికి పట్టడంలో పూరీ జగన్నాథ్ దిట్ట. చాలామంది పూరీ పరిచయం చేసే హీరోయిన్స్ గురించి.. లేకపోతే ఐటెం గాళ్స్ గురించి మాట్లాడతారు కానీ.. కేరక్టర్ నటులను కూడా పూరీ బాగానే పట్టుకొస్తాడు. షార్ట్ ఫిలిమ్స్ తో కుస్తీలు పడుతున్న భద్రం అనే నటుడికి.. జ్యోతిలక్ష్మి మూవీలో అమ్మాయిల బ్రోకర్ పాత్రను ఇచ్చి.. ఓవర్ నైట్ లో సినిమా ఆర్టిస్టును చేసేశాడు.

మెల్లమెల్లగా అయినా.. కెరీర్ ను ఈ కుర్రాడు బాగానే గాడిలో పెట్టుకున్నాడు. కామెడీ పాత్రలతో అలరిస్తున్నాడు. ఇప్పుడీ యంగ్ కమెడియన్.. వార్తల్లో నిలవడానికి స్పెషల్ గా ఏమీ ట్రై చేయడం లేదు కానీ.. రీసెంట్ గా చేసిన ఓ పని కారణంగా.. సడెన్ గా న్యూస్ లోకి వచ్చేశాడు. వినాయక చవితి సందర్భంగా పలువురు సినిమా జనాలకు మట్టి గణేషుడి విగ్రహాలను బహుమతులుగా పంచాడు భద్రం. అందులో భాగంగా మాజీ హీరోయిన్ ఛార్మీ కౌర్ కు కూడా ఓ గణేషుడి ప్రతిమను అందించాడు భద్రం. ఆమె లీడ్ రోల్ పోషించిన జ్యోతిలక్ష్మి చిత్రంతోనే భద్రం సినీ నటుడుగా మారాడు కదా. అదన్న మాట రిలేషన్.

బోలెడంత పని ఒత్తిడిలో ఉండగా భద్రం తెచ్చిన గిఫ్ట్ ఎకో ఫ్రెండ్లీ గణేషా.. ఎంతో ఒత్తిడిని తగ్గించిందంటూ తెగ మురిసిపోతోంది 'జ్యోతిలక్షి' ఛార్మి. పర్యావరణానికి హితం చేసే మట్టి వినాయకులను ఉపయోగించమంటూ చాలామంది ప్రోత్సహిస్తున్నారు కానీ.. ఇలా వారి దగ్గరకే వెళ్లి మరీ వినాయకుని ప్రతిమలను నటుడు భద్రం అందిస్తూ ఉండడం అనే కాన్సెప్ట్ అందరినీ బాగానే ఆకట్టుకుంటోంది.