Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ​లో ఎన్నో అవమానాలు.. నాలుగు సార్లు ఆత్మహత్యకు యత్నించా!

By:  Tupaki Desk   |   25 Nov 2020 5:00 AM IST
బాలీవుడ్ ​లో ఎన్నో అవమానాలు.. నాలుగు సార్లు ఆత్మహత్యకు యత్నించా!
X
సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్​లో నెపొటిజం సమస్య తెరమీదకు వచ్చింది. పలువురు యువహీరోలు, నటిమణులు తాము ఎదుర్కొన్న సమస్యలను బయటపెడుతూ వస్తున్నారు. బాలీవుడ్​లో హీరోలుగా రాణించడం చాలా కష్టమని.. అక్కడి కొందరి గుత్తాధిపత్యం ఉంటుందని. . బంధుప్రీతి ఎక్కువన్న ఆరోపణలు వచ్చాయి. ఓ దశలో సుశాంత్​సింగ్​ కు సోషల్​మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నెపోటిజంతో వచ్చిన హీరోలు, హీరోయిన్లపై సోషల్​మీడియాలో ఓ యుద్ధమే జరిగింది. అలియాభట్​ లాంటి నటీమణులకు తీవ్ర వ్యతిరేకతో ఎదురైంది. మరో వైపు ఈ కేసు అనంతరం బాలీవుడ్​లో డ్రగ్స్​ మాఫియా కూడా తెరమీదకు వచ్చింది. సుశాంత్​సింగ్​ ప్రేయసి రియా అరెస్టయ్యారు. డ్రగ్స్​కేసులో మరో 50 మంది పేర్లు బయటకు వస్తాయన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ తర్వాత ఆ కేసు అనూహ్యంగా మూతపడింది. అందుకు కారణాలు అనేకం.

అయితే సుశాంత్​ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్​ హీరోలు వివిధ విషయాలను నిర్భయంగా బయటకు చెబుతున్నారు. ఓ టీవీ చానల్​ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్​ సద్​ తన మనసులోని విషయాలు బయటపెట్టారు. బిగ్​బాస్ షో తో అమిత్ ఎంతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత అతడికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఓటీటీ లో ప్రసారమయ్యే వెబ్​ సీరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ సంచలన విషయాలు బయటపెట్టారు. ‘ఫూంక్ 2 చిత్రంతో బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చాను. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ తో కలిసి ' కాయి పో చే ' అనే చిత్రం లో నటించా.. కానీ ఆ తర్వాత నాకు అవకాశాలు రాలేదు. దీంతో ఎంతో మానసిక క్షోభకు గురయ్యాను.

నేను అవకాశాల కోసం చాలామందికి వద్దకు వెళ్లా. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. ఒకటి రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి అనేక అవమానాలు ఎదురయ్యాయి. 16 నుంచి 18 ఏళ్ల మధ్య లో నాలుగు సార్లు సూసైడ్‌కు ప్రయత్నించాను. అయితే ఎవరూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోవద్దు. ధైర్యంగా సమస్యలు ఎదుర్కొవాలి. ఆత్మహత్య తప్పు కాబట్టే.. నేను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నా’ అంటూ అమిత్ తన మనసులోని విషయాన్ని పంచుకున్నారు.