Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డి ఏంటో అందరికీ అర్ధమైపోయింది

By:  Tupaki Desk   |   26 Jun 2018 5:03 PM IST
శ్రీరెడ్డి ఏంటో అందరికీ అర్ధమైపోయింది
X
టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది నటి శ్రీరెడ్డి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం కోసం నడిరోడ్డుపై అర్ధనగ్న నిరసనతో బాగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తరవాత కాస్టింగ్ కౌచ్ పై పోరాటమంటూ టీవీ ఛానళ్ల ముందు బాగానే హంగామా చేసింది. పవర్ స్టార్ ఫవన్ కళ్యాణ్ పై అనవసరమైన కామెంట్లతో ఒక్కసారిగా డీఫేమ్ అయిపోయింది.

కాస్టింగ్ కౌచ్ పోరాటమంటూ శ్రీరెడ్డి హడావుడి చేసిన టైంలో మహిళా ఆమెకు బాగానే సపోర్ట్ గా ఇచ్చాయి. కానీ ఆ సంఘాల ప్రతినిధులు ఎవ్వరూ ఆమె పక్కన కనిపించడం లేదు. శ్రీరెడ్డి సెన్సేషలిజం కోసం సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం లేదని అర్ధమవడం వల్లే ఆమెను దూరంగా పెట్టామని మహిళా సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ‘‘మొదట్లో ఆమెను ఇండస్ట్రీలోని వేధింపులతో అన్యాయానికి గురైన మహిళగా భావించి అండగా నిలిచాం. కానీ ఆమె తీరు మా లక్ష్యాలకు విరుద్ధంగా ఉంది. ఆమె ప్రవర్తనే అభ్యంతరకరంగా ఉంది’’ అంటూ ఉమెన్ యాక్టివిస్ట్ సంధ్య చెప్పుకొచ్చారు.

ఇప్పుడు శ్రీరెడ్డి మాటలను టీవీ ఛానళ్లు పట్టించుకోవవడం లేదు. అందుకోసమే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఏదో ఒక ఇష్యూను రెయిజ్ చేస్తూనే ఉంది. ఏది ట్రెండింగ్ లో ఉంటే అందులో ఎంటరయిపోతోంది. బిగ్ బాస్ -2 స్టార్టవడానికి ముందు నాచురల్ స్టార్ నానిపై చాలా భయంకరమైన ఆరోపణలు చేసింది. కానీ వేటికీ ఆధారాలు మాత్రం చూపలేదు. తాజాగా అమెరికాలో సెక్స్ రాకెట్ బయటపడింది కూడా తాను ఇచ్చిన సమాచారంతోనే అంటూ చెప్పుకొచ్చింది. అందులో ఇన్వాల్వ్ అయినవాళ్లంటూ చాలామంది పేర్లు చెప్పింది. కానీ ఎప్పటిలాగే ఈసారి ఎలాంటి ఆధారాలు చూపించలేదు.