Begin typing your search above and press return to search.

గిల్డ్ కీల‌క ప్రెస్ మీట్ రెడీ అవుతోందా?

By:  Tupaki Desk   |   13 Jun 2022 9:32 AM GMT
గిల్డ్ కీల‌క ప్రెస్ మీట్ రెడీ అవుతోందా?
X
రెగ్యుల‌ర్ గా సినిమాలు చేసే వాళ్లంతా గ‌త కొంత కాలం క్రితం కొత్త‌గా 'యాక్టీవ్ తెలుగు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్' పేరుతో కొత్త కౌన్సిల్ ని ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా ఇండ‌స్ట్రీలో వున్న కార్మికుల‌కు అవ‌కాశాల్ని అందించ‌డ‌మే కాకుండా స‌మాన‌త్వాన్ని కాపాడ‌ట‌మే ప్ర‌దాన అజెండాగా ప‌ని చేస్తోంది.

పైగా సినిమాల‌కు సంబంధించిన యాడ్స్ రేటల‌ని నిర్ణ‌యించ‌డం, ప‌లు ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించిన ఫండ్ ని, ప్ర‌క‌ట‌న‌ల‌ని గిల్డ్ ద్వారానే అందించ‌డం చేస్తోంది.

యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ త్వ‌ర‌లో సినిమా టికెట్ ల‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 'ట్రిపుల్ ఆర్‌' మూవీ నుంచి టికెట్ రేట్ ల‌ని మూడు నాలుగు రోజుల పాటు పెంచుకునే వెసులు బాటుని క‌ల్పిస్తూ ఉభ‌య తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక జీవోల‌ని విడుద‌ల చేశాయి. ప్ర‌తి స్టార్ మూవీ టైమ్ లో టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటుని క‌ల్పిస్తూ వ‌చ్చారు.

ఇప్పుడు ఇదే ఆ త‌రువాత విడుద‌లైన ఎఫ్ 3, స‌ర్కారు వారి పాట‌, అంటే సుంద‌రానికి' వంటి సినిమాల‌కు సంక‌టంగా మారింది. టికెట్ రేట్లు త‌గ్గించామ‌ని 'ఎప్ 3' మేక‌ర్స్ ప్ర‌చారం చేసినా ఈ మూవీకి క‌లెక్ష‌న్స్ పెద్ద‌గా రాలేదు. కార‌ణం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డ‌మే.

టికెట్ రేట్లు భారీగా పెంచ‌డం కూడా ఇప్ప‌డు ప్ర‌దాన స‌మ‌స్య‌గా మారింది. ఎఫ్ 3, స‌ర్కారు వారి పాట‌, అంటే సుంద‌రానికి' టాక్ బాగున్నా ఈ సినిమాలేవీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయాయి.

ఈ విస‌యాల్ని గ్ర‌హించిన గిల్డ్ ప్ర‌త్యేకంగా స‌మావేశం అయిన‌ట్టుగా తెలుస్తోంది. టికెట్ ధ‌ర‌ల‌పై అనుస‌రించాల్సిన విధానంపై సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ట‌. టికెట్ రేట్లు పెంచ‌డం వ‌ల్ల ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని గ‌మ‌నించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల విష‌యంలో బుక్ మై షో ఆధాప‌త్యంపై కూడా సీరియ‌స్ యాక్ష్ తీసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇదే విష‌యాల‌తో త్వ‌ర‌లో ప్ర‌త్యేకంగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయ‌బోతున్నాట‌.