Begin typing your search above and press return to search.

#RC12: అజర్ బైజాన్ అదిరిపోతుందట!

By:  Tupaki Desk   |   6 Sept 2018 11:41 AM IST
#RC12: అజర్ బైజాన్ అదిరిపోతుందట!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ సినిమాను #RC12 గా పిలుచుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం ఫిలిం యూనిట్ అజర్ బైజాన్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. 25 రోజులు జరుగనున్న ఈ షెడ్యూల్ లో బోయపాటి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను - కీలక సన్నివేశాలను ప్లాన్ చేశాడట.

ఇక ఈ సీన్స్ ఎలా ఉండబోతున్నాయో అభిమానులకు చరణ్ వైఫ్ ఉపాసన ఒక హింట్ ఇచ్చింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా చరణ్ స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతున్న ఫోటోను పోస్ట్ చేసి "#RC12 అజర్ బైజాన్ షెడ్యూల్ కు అంతా సిద్దం. రఫ్ & రా గా ఉండబోతోంది!" ఇక చరణ్ వెనకనుండి తీసిన ఫోటోలో కండలు తిరిగి సల్మాన్ ఖాన్ లాగా కనిపిస్తున్నాడు. హీరో ఫిజిక్ ఇలా పర్ఫెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా యాక్షన్ సీక్వెన్స్ కు కొత్త అందం వస్తుంది. ఇక బోయపాటి అంటేనే రచ్చ రంబోలా ఫైట్లకు కేరాఫ్ అడ్రెస్.. ఉపాసన వదినమ్మ చెప్పినట్టు ఇక రా & రఫ్ యాక్షనే. అజర్ బైజాన్ అదిరిపోవడం ఖాయం.

చరణ్ మొదటినుండి మాస్ మసాల సినిమాలే ఎక్కువగా చేశాడు గానీ 'ధృవ' నుండి రూటు మార్చాడు. ఇక 'రంగస్థలం' లో చిట్టిబాబు హంగామా తర్వాత ఫ్యాన్స్ అందరూ చరణ్ ఊర మాస్ అవతారం కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.