Begin typing your search above and press return to search.

పవన్ యాక్షన్ బొనాంజా.. కాటమరాయుడు

By:  Tupaki Desk   |   6 Feb 2017 10:00 AM GMT
పవన్ యాక్షన్ బొనాంజా.. కాటమరాయుడు
X
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు.. యూట్యూబ్ సెన్సేషన్స్ గురించి ఇప్పటికే చెప్పేసుకున్నాం. కేవలం రోజున్నర లోనే 45 లక్షల వ్యూస్.. 1.65 లైక్స్ తో దూసుకుపోతున్నాడు కాటమరాయుడు. నిజానికి కాటమరాయుడు చిత్రం.. అజిత్ నటించిన తమిళ్ మూవీ వీరంకు రీమేక్. ఈ విషయాన్ని యూనిట్ లో ఎవరూ పైకి చెప్పడం లేదు కానీ.. ఇప్పటికే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది.

తెలుగులో డబ్బింగ్ వెర్షన్ వచ్చి రిలీజ్ అయిన సినిమాను పవన్ చేయడం వెనుక చాలామందికి డౌట్స్ ఉన్నాయ్ కానీ.. అసలీ కాటమరాయుడు చేయడం వెనక అసలు కథేంటో.. ఎందుకు అంత పట్టుబట్టి ఇదే ప్రాజెక్ట్ చేస్తున్నాడో అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కాటమరాయుడు టీజర్ చూస్తే.. యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారనే విషయం తెలుస్తూనే ఉంది. సినిమా కూడా ఫుల్ ప్లెడ్జెడ్ గా యాక్షన్ ఓరియెంటెడ్ గానే సాగనుందని తెలుస్తోంది.

పవన్ ట్రేడ్ మార్క్ ఫైట్స్ ఈ మూవీకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఒక్క ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ఫైట్ మినహాయిస్తే.. కాటమరాయుడులో అన్ని యాక్షన్ సీక్వెన్స్ లను కొత్తగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ అద్భుతంగా వచ్చాయట. కండువా గాల్లోకి ఎగిరితే.. కింద పడేలోపు ఫైట్ కంప్లీట్ చేయడం లాంటి పవన్ మార్క్ పైట్స్ కూడా ఉంటాయట. పవర్ స్టార్ పూర్తి స్థాయిలో యాక్షన్ మూవీ చేస్తే ఎలా ఉంటుందనే చూపించేందుకే.. ఈ ఫ్యాక్షన్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నారని తెలుస్తోంది.

కంప్లీట్ గా ఫైటింగ్స్ జోనర్ తో పవన్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించనున్నారట. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర.. నందమూరి బాలకృష్ణకు ఓ నరసింహనాయుడు స్థాయిలో.. పవన్ కళ్యాణ్ కెరీర్ లో కాటమరాయుడు నిలిచిపోతాడన్నది లేటెస్ట్ టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/