Begin typing your search above and press return to search.

'హంట్' లో యాక్ష‌న్ పీక్స్ లోనేనా?

By:  Tupaki Desk   |   26 Dec 2022 10:13 AM GMT
హంట్ లో యాక్ష‌న్ పీక్స్ లోనేనా?
X
యంగ్ హీరో సుధీర్ బాబుకి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మవుతోంది. విజ‌యం కోసం వెయిట్ చేస్తోన్న హీరోల్లో ఇత‌ను ఒక‌డు. ప్ర‌స్తుతం చేతిలోసినిమాలైతే బాగానే ఉన్నాయి. మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక‌టి 'హంట్'. హైఓల్టేజ్ యాక్ష‌న్  ఎంట‌ర్ టైన‌ర్ గా  మ‌హేష్ అనే కొత్త కుర్రాడు హంట్ ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు పాజిటివ్ బ‌జ్ ని తీసుకొస్తున్నాయి.

ఇక ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్లు పనిచేయ‌డం విశేషం. సినిమాలో కొన్నియాక్ష‌న్ సన్నివేశాలు స్టంట్ మాస్ట‌ర్ల‌ని డిమాండ్ చేయ‌డంతో టీమ్ ఏ మాత్రం  వెన‌క్కి త‌గ్గ‌కుండా స్టంట్ మాస్ట‌ర్ల‌ని రంగంలోకి దించారు. దీంతో సినిమాలో యాక్షన్ ఘట్టాలు మరింత స్పెషల్ గా వుండనున్నాయ‌ని తెలుస్తోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో వుంటాయని అంచ‌నా వ‌యేచ్చె.

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో బ్రయాన్ విజయన్ 'హంట్ ' కోసం యాక్షన్ ఘట్టాలని కంపోజ్ చేసారు. వాటి కోసం సుధీర్ బాబు ఎంతో శ్ర‌మించారు. లుక్ ప‌రంగా బాడీలో చాలా మార్పులు తీసుకొచ్చారు. అవ‌న్ని ఈ సినిమా మేకోవ‌రకు దోహ‌దం చేసాయి.  సినిమాలో  యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్ర‌ధానంగా హైలైట్ కానున్న‌ట్లు తెలుస్తోంది.  

హీరో శ్రీకాంత్.. ప్రేమిస్తే భరత్ ఇందులో   కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన 'పాపతో పైలం ' అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే. మాస్ ని ఈ సాంగ్ ఎట్రాక్ట్ చేస్తోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.

ఇందులో  సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో మైమ్ గోపి కబీర్ దుహన్ సింగ్ మౌనిక రెడ్డి గోపరాజు రమణ మంజుల చిత్రా శుక్లా సుపూర్ణ మల్కర్ సంజయ్ స్వరూప్ తదితరులు నటిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.