Begin typing your search above and press return to search.

యాక్షన్ కింగ్ నా క్రష్..అంటున్న స్టార్ యాంకర్

By:  Tupaki Desk   |   29 April 2020 12:30 PM IST
యాక్షన్ కింగ్ నా క్రష్..అంటున్న స్టార్ యాంకర్
X
టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి సినిమా అవకాశాలను దక్కించుకొని నటులుగాను రాణిస్తున్న వాళ్లలో జబర్దస్త్ యాంకర్‌ అనసూయ ఒకరు. నటిగా - యాంకర్‌ గా - స్పెషల్ సాంగ్స్ లో ఆదిపడుతూ.. లక్షల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అనసూయ. అన్నీ విధాలుగా అనసూయ అభిమానులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో మాత్రం అనసూయ ఏం చేసినా వివాదాలకు గురవుతుంది. యూత్ లో అనసూయకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కారణంగానే ఆమెకి వరుసగా సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. అనసూయ అలవాట్లు అభిరుచులు అభిప్రాయాలు ఇష్టాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి అనసూయ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పుకొచ్చింది.

ఇక అనసూయ తనకు ఇష్టమైన విషయాలను చెప్తూ.. సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ఒక ప్రశ్నకి స్పందించింది. "భారీ చిత్రాల దర్శకుడు శంకర్ మొదటి సినిమాగా వచ్చిన 'జెంటిల్ మేన్' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి నేను యాక్షన్ కింగ్ అర్జున్ కి అభిమానిగా మారిపోయాను. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమాతో ఆయనంటే క్రష్ ఏర్పడింది. అప్పట్లో ఆయనకి నేను వీరాభిమానిని" అంటూ చెప్పుకొచ్చింది. ఆ మధ్య వచ్చిన 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా మంచి మార్కులు కొట్టేసిన ఆమె - అంతే ప్రాధాన్యతను కలిగిన మరికొన్ని పాత్రలను పోషిస్తోంది. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందట.