Begin typing your search above and press return to search.

పవన్ త్రివిక్రమ్ మూవీలో హైలైట్ ఆ ఫైట్

By:  Tupaki Desk   |   31 Oct 2017 12:39 PM GMT
పవన్ త్రివిక్రమ్ మూవీలో హైలైట్ ఆ ఫైట్
X

పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే జనాల్లో విపరీతమైన ఆసక్తి పెరిగిపోతుంది. అటు నవ్వులు.. ఇటు ఎమోషన్స్.. రెండూ పీక్స్ లో ఉంటాయి. వీటితో పాటు అంతగా ఉన్నట్లు కనిపించకపోయినా.. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా వీరి కాంబోలో అదిరిపోయే స్థాయిలో ఉంటాయి.

జల్సా మూవీలో అయినా.. అత్తారింటికి దారేది చిత్రం తీసుకున్నా.. రెండింటిలోనూ యాక్షన్ ఎపిసోడ్స్ వైవిధ్యంగాను.. ఆకట్టుకునే రీతిలోను ఉంటాయి. ఇప్పుడు తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రానికి అజ్ఞాతవాసి అనే టైటిల్ పెట్టే అవకాశాలు ఉండగా.. ఇందులో కూడా ఓ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. పైగా మార్షల్ ఆర్ట్స్ కు ప్రాధాన్యత ఉండేలా ఈ ఫైట్ ను డిజైన్ చేశారని తెలుస్తోంది. పవర్ స్టార్.. మార్షల్ ఆర్ట్స్ కి లింక్ ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ పై ఓ ఫైట్ అనగానే.. ఆసక్తి పెరిగిపోవడం ఖాయం. జనాల్లో ఉండే ఈ ఆసక్తిని ఏ మాత్రం తగ్గించని రేంజ్ లో ఈ ఫైట్ ను పిక్చరైజ్ చేశారట.

పవన్ ఈ ఫైట్ 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకుని మరీ చేయడం విశేషం. రీసెంట్ గా పిక్చరైజ్ చేసిన ఈ ఫైట్.. మూవీ హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ అండ్ త్రివిక్రమ్ టీం.. యూరోప్ లో పాటల చిత్రీకరణ కోసం చక్కర్లు కొడుతున్నారు.