Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలతో నటిస్తున్నా అమ్మడిని ఐటమ్ భామగానే గుర్తిస్తున్నారే

By:  Tupaki Desk   |   28 Jan 2022 1:30 AM GMT
స్టార్ హీరోలతో నటిస్తున్నా అమ్మడిని ఐటమ్ భామగానే గుర్తిస్తున్నారే
X
'ఫుల్ కిక్కు' పాటతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది డింపుల్ హయాతి. 'ఖిలాడి' చిత్రంలో రవితేజ సరసన నటించిన డింపుల్.. లేటెస్టుగా విడుదలైన మాస్ డ్యాన్స్ నంబర్ లో అదరగొట్టింది. మాస్ మహారాజాతో పోటాపోటీగా ఊర మాస్ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే స్టార్ హీరో పక్కన ప్రధాన నటిగా చేస్తున్నా హయతి ఇంకా ఐటెం సాంగ్ హీరోయిన్‌ గానే కనిపిస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'గల్ఫ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ డింపుల్ హయాతి. ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన 'అభినేత్రి 2' చిత్రంతో పాటుగా 'యురేక' అనే సినిమాలో నటించింది. ఈ క్రమంలో 'గడ్డలకొండ గణేష్' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి ఐటమ్ భామగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల 'అత్రాంగిరే' మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో ధనుష్ ప్రేయసి పాత్రలో డింపుల్ అలరించింది.

ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'ఖిలాడి' సినిమాలో హయాతి ఒక హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలానే విశాల్ హీరోగా నటించిన 'సామాన్యుడు' అనే బైలింగ్విల్ మూవీలో డింపుల్ నటించింది. ధనుష్ - రవితేజ - విశాల్ వంటి స్టార్ హీరోల పక్కన నటించి లీడ్ యాక్ట్రెస్ గా మారినా.. ఈ బ్యూటీ మాత్రం స్పెషల్ సాంగ్ హీరోయిన్‌ గానే కనిపిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి.

రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కావాల్సిన 'సామాన్యుడు' సినిమా వాయిదా పడింది. త్వరలోనే తదుపరి తేదీని ప్రకటించనున్నారు. ఇక ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన 'ఖిలాడి' సినిమా వాలెంటైన్స్ వీక్ లో ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు డింపుల్ హయాతి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందిస్తాయని సినీ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలు అమ్మడికి ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.