Begin typing your search above and press return to search.

భారీ బ్యాంగ్ మిస్ చేస్తూ.. తన మూవీ టైటిల్ ను చెప్పేసిన చిరు

By:  Tupaki Desk   |   2 March 2020 4:38 AM GMT
భారీ బ్యాంగ్ మిస్ చేస్తూ.. తన మూవీ టైటిల్ ను చెప్పేసిన చిరు
X
ఇవాల్టి రోజున క్రేజీ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని లెక్కలేసుకొని మరీ అనౌన్స్ చేయటం ఒక అలవాటైంది. అలాంటి తీరుకు భిన్నంగా వ్యవహరించిన మెగాస్టార్ అందరిని సర్ ప్రైజ్ చేశారు. సైరా తర్వాత చిరు నటిస్తున్న 152వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టైటిల్ మీద ఉత్కంఠ నెలకొని ఉన్న వేళ.. అనుకోని రీతిలో మూవీ టైటిల్ ను రివీల్ చేసేశారు చిరు.

హైదరాబాద్ లో జరిగిన ఒక పిట్టకథ మూవీ ప్రీరిలీజ్ వేడుకకు హాజరైన ఆయన.. అభిమానుల అభిమానంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. అప్రయత్నంగా తాను చేస్తున్న మూవీ టైటిల్ ను చెప్పేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. ఇప్పటివరకూ సస్పెన్స్ గా మారిన మూవీ టైటిల్ ను తమ అభిమాన నటుడే స్వయంగా చెప్పేయటంతో మెగా అభిమానులు కేరింతలు కొట్టారు.

కొరటాల శివతో తాను చేస్తున్న మూవీకి ‘‘ఆచార్య’’ అన్న టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లుగా చెప్పారు చిరు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. చిత్ర టైటిల్ ను దర్శకుడు శివ చక్కటి ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేసి ప్రకటించాలనుకున్నాడని.. కానీ అనుకోని రీతిలో తాను చెప్పేసినట్లుగా చెప్పారు చిరు.

ఎక్కడ మిస్ అయ్యానో తెలీయటం లేదు.. టైటిల్ ను లాంఛ్ చేద్దామనుకున్న శివ ఏమీ అనుకో వద్దు. నా నోటితోనే సినిమా టైటిల్ చెప్పేశాను. మంచి వార్తల్ని ఆపుకోలేం. వాటిని ఆపటం కరెక్ట్ కాదన్న చిరు.. దర్శకుడు శివకు సారీ చెప్పేశారు. భారీ బ్యాంగ్ తో టైటిల్ అనౌన్స్ చేయాలనుకున్న శివకు చిరు చేసిన పని షాక్ అని చెప్పక తప్పదు.