Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: గుణపాఠాలు చెప్పడానికి ధర్మస్థలిలో అడుగుపెట్టిన 'ఆచార్య

By:  Tupaki Desk   |   29 Jan 2021 10:52 AM GMT
టీజర్ టాక్: గుణపాఠాలు చెప్పడానికి ధర్మస్థలిలో అడుగుపెట్టిన ఆచార్య
X
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆచార్య’. సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్స్ పై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్‌ కిచ్లు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ 'సిద్ధ' అనే పాత్రలో కనిపించనున్నాడు. సామాజిక అంశాల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించి కొరటాల తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న 'ఆచార్య' టీజర్ ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.

'ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం.. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు..' అంటూ రాంచరణ్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. ధర్మస్థలిలో అడుగుపెట్టిన ఆచార్య, అక్కడి వారికోసం చేసే పోరాటాన్ని ఇందులో చూపించారు. 'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో 'ఆచార్య' అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..' అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ తో టీజర్ ముగిసింది. దీనికి 'ఆచార్య దేవో భవ.. ఆచార్య రక్షో భవ' అంటూ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. సినిమాటోగ్రాఫర్ తిరు - ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ కలసి అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. మొత్తం ఈ యాక్షన్ ఫ్యాక్డ్ 'ఆచార్య' టీజర్ విజువల్ ట్రీట్ లా ఉంది. ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.