Begin typing your search above and press return to search.

రూమర్స్ కి చెక్ పెట్టిన 'ఆచార్య' టీమ్..!

By:  Tupaki Desk   |   4 Nov 2020 1:20 PM IST
రూమర్స్ కి చెక్ పెట్టిన ఆచార్య టీమ్..!
X
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఆచార్య''. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. కొన్ని రోజులు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ మధ్య సినిమా షూటింగ్స్ అన్నీ తిరిగి స్టార్ట్ అవుతున్నప్పటికీ 'ఆచార్య'ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారనే దానిపై క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో 'ఆచార్య' సినిమాపై అనేక రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

కొరటాల శివ 'ఆచార్య' స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడని.. అందుకే షూటింగ్ లేట్ అవుతోందని.. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు అన్నాయి అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా 'ఆచార్య' టీమ్ ఒక ట్వీట్ చేసి ఈ రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టింది. ''లాక్ డౌన్ తర్వాత మేము అన్ని భద్రతా జాగ్రత్తలతో నవంబర్ 9 నుండి తిరిగి సెట్స్ పైకి రావడానికి సంతోషిస్తున్నాము. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో సినిమాలోని ఎక్కువ భాగం షూటింగ్ పూర్తవుతుంది'' అని 'ఆచార్య' మేకర్స్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా 2021 సమ్మర్ కి థియేటర్లలో మెగా మాస్ ప్రారంభమవుతుందని ప్రకటించింది. కాగా, సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.