Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: ధర్మస్థలిలో దర్జాగా నిలబడిన 'ఆచార్య'

By:  Tupaki Desk   |   20 Aug 2021 8:20 AM IST
వైరల్ పిక్: ధర్మస్థలిలో దర్జాగా నిలబడిన ఆచార్య
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయింది. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటన కూడా మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2022 సంక్రాంతి సందర్భంగా లేదా 2021 దసరా కానుకగా 'ఆచార్య' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలు పెట్టిన ఫ్యాన్స్ కోసం.. మరిన్ని సర్ప్రైజ్ లు రాబోతున్నాయి.

అయితే 'ఆచార్య' టీమ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఓ స్పెషల్ పోస్టర్.. తాజాగా అనధికారికంగా బయటకు వచ్చింది. ఈ పోస్టర్ లో ధర్మస్థలి వద్ద చిరంజీవి నిలబడి ఉన్నాడు. చిరు కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేయాలని అనుకున్నట్లు అర్థం అవుతుంది. అయితే ఇందులో రిలీజ్ డేట్ ప్రస్తావన లేకపోవడంతో ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని కామెంట్ చేసే వారు కూడా లేకపోలేదు. ఏదేమైనా ఈ పోస్టర్ ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.

కాగా, 'ఆచార్య' చిత్రంలో కామ్రేడ్ సిద్ధ గా రామ్ చరణ్ కనిపించనున్నారు. చెర్రీ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేసింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.