Begin typing your search above and press return to search.
'ఆచార్య' షూటింగ్ ఆశ్చర్యకర అప్ డేట్
By: Tupaki Desk | 26 Dec 2020 11:07 AM ISTమెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలల పాటు నిలిచి పోయిన విషయం తెల్సిందే. కరోనా ఆందోళనకరంగా ఉన్నా కూడా చిరంజీవి ఆచార్య పూర్తి చేసే ఉద్దేశ్యంతో షూటింగ్ కు రెడీ అయ్యారు. కరోనాకు ముందే కొంత మేరకు షూటింగ్ చేసిన ఆచార్య ఇటీవల షూటింగ్ ను చాలా స్పీడ్ గా చేస్తున్నారు. షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది అంటున్నారు. కొన్ని రోజుల క్రితమే షూటింగ్ లో జాయిన్ అయిన కాజల్ అగర్వాల్ షూటింగ్ పార్ట్ పాట మినహా మొత్తం పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.
సారధి స్టూడియోలో వేసిన ఒక సెట్టింగ్ లో చిరంజీవి కాజల్ లపై మూడు రోజుల పాటు పాట చిత్రకీరణ చేయబోతున్నారు. దాంతో ఆచార్యలో కాజల్ పార్ట్ మొత్తం పూర్తి అవ్వబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. షూటింగ్ కు మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చకచక పూర్తి చేస్తున్నాడు. గతంలో కొరటాల శివ వంద రోజుల లోపులోనే సినిమాను పూర్తి చేస్తానంటూ ప్రకటించాడు. అన్నట్లుగానే ఆచార్య కు వంద వర్కింగ్ డేస్ కూడా తీసుకోకుండానే పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ లేదా మే లో విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరిలో సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉందంటున్నారు.