Begin typing your search above and press return to search.

మాస్ నంబర్ ని విడుదలకి సిద్ధం చేస్తున్న టీమ్ ఆచార్య!

By:  Tupaki Desk   |   5 Aug 2021 8:39 AM GMT
మాస్ నంబర్ ని విడుదలకి సిద్ధం చేస్తున్న టీమ్ ఆచార్య!
X
టాలీవుడ్ నుంచి వచ్చే క్రేజీ ప్రాజెక్టులల్లో మెగాస్టార్ - కొరటాల శివ కలయికలో వచ్చే ఆచార్య ఒకటి. ఒకవేళ కరోనా మహమ్మారి రాకపోయుంటే ఈ పాటికి ఈ సినిమా విడుదలయ్యుండేదేమో.

రెండు పాటల మినహా, ఆచార్య టాకీ పార్ట్ పూర్తయింది అని సమాచారం. ఎటూ చిత్ర షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకోవడంతో, ఆచార్య నుంచి ఒక పాట విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ఒక పాట ఆచార్య లో ఉందని. ఈ పాట రిలీజ్ చేస్తే, మంచి బజ్ క్రియేట్ అయ్యి, సినిమాని ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుందని మెగాస్టార్ అభిప్రాయ పడుతున్నారని సమాచారం.

అనుకున్నదే తడవుగా, మాస్ పాటని విడుదలకి సిద్ధం చేయాలని టీమ్ ని మెగాస్టార్ చిరంజీవి అడిగినట్టు సమాచారం.

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నాడు. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ ఇందులో నాయికలు. స్వర బ్రహ్మ మణిశర్మ ఆచార్య కి స్వరాలు సమకూరుస్తున్నారు.