Begin typing your search above and press return to search.

పోలీస్ గ్రౌండ్స్ లో ఆచార్యుడి హంగామా

By:  Tupaki Desk   |   21 April 2022 7:00 PM IST
పోలీస్ గ్రౌండ్స్ లో ఆచార్యుడి హంగామా
X
టాలీవుడ్ లీవింగ్ లెజెంగ్ మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్లు దాటుతోంది. ఆ స‌మ‌యం ఎప్పుడు వ‌స్తుందా? అని అభిమానుల‌తో పాటు స‌గ‌టు సినీ ప్రియులు చిరు సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ `సైరా న‌ర‌సింహారెడ్డి` త‌రువాత న‌టించిన చిత్రం `ఆచార్య‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించారు. త‌న ప్ర‌తి చిత్రంలోనూ స‌మాజిక అంశాన్ని మిళితం చేసి క‌మ‌ర్ష‌యిల్ క‌థ‌ల్ని అందించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని కూడా ఓ సామాజిక స‌మస్య నేప‌థ్యంలో తెర‌కెక్కించారు.

మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ , కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై ఈ భారీ మూవీని శ్రీ‌మతి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో నిరంజ‌న్ రెడ్డితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి ఎండోమెంట్ అధికారిక‌గా, ఓ ద‌శ‌లో చ‌ర‌ణ్ తో క‌లిసి న‌క్స‌లైట్ గా నూ క‌నిపించ‌బోతున్నారు. ధ‌ర్మ‌స్థ‌లి కోసం వీరు ఏం చేశారు? .. చ‌ర‌ణ్ కిచ్చినన మాట కోసం ఆచార్యుడు ఏం చేశాడు? ధ‌ర్మ‌స్థ‌లికి అండ‌గా ఎలా నిలిచాడనే క‌థా, క‌థ‌నాల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టుగా ట్రైల‌ర్ తో స్ప‌ష్టం అవుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ లో చిరు, చ‌ర‌ణ్ ల‌పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు, చిరుత‌ల్లా ఇద్ద‌రు చెల‌రేగిన తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రాన్ని ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 29న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. రిలీజ్ డేట్ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌చార ప‌ర్వం స్పీడందుకుంది. రామ్ చ‌ర‌ణ్- కొర‌టాల శివ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూని తాజాగా విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఈ నెల 23న భారీ ప్రీ రిలీజ్ ఈ వెంట్ ని ప్లాన్ చేశారు. ముందు అనుకున్న ప్ర‌కారం విజ‌య‌వాడ‌లో భారీ స్థాయిలో ఈ ఈవెంట్ ని నిర్వ‌హిస్తార‌ని ప్రచారం జ‌రిగింది.

అంతే కాకుండా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతార‌ని కూడా అన్నారు. కానీ అది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కానీ `ఆచార్య‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం హైద‌రాబ‌ద్ లో నే నిర్వ‌హించ‌బోతున్నారు. యూస‌ఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఆచార్య ప్రీ రిలీజ్ హంగామా భారీ స్థాయిలో జ‌ర‌గ‌బోతోంది. ఇందు కోసం ప్ర‌త్యేక అతిథులు హాజ‌రు కానున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఈ భారీ ఈవెంట్ కి ఛీఫ్ గెస్ట్ లుగా హాజ‌రు కానున్నార‌ని, ఏప్రిల్ 23న రాత్రి 6 గంట‌ల‌కు ఈవెంట్ ప్రారంభం కాబోతోంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ బుధ‌వారం మేక‌ర్స్ ప్ర‌త్యేక పోస్ట‌ర్స్ ని విడుద‌ల చేశారు. దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న చిరు సినిమా ఈవెంట్ కాబ‌ట్టి ఫ్యాన్స్ భారీ స్థాయిలో హాజ‌రు కానున్నార‌ని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ అందిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారంలో వున్న నిజ‌మెంత అన్న‌ది తెలియాలంటే ఈ నెల 23 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.