Begin typing your search above and press return to search.

1-2-3-4 అంటున్న ఆచార్య‌.. ఏంటీ అస‌లు క‌థ‌?

By:  Tupaki Desk   |   20 July 2020 5:00 PM IST
1-2-3-4 అంటున్న ఆచార్య‌.. ఏంటీ అస‌లు క‌థ‌?
X
ఒక్క సినిమా-1.. ఇద్ద‌రు డై‌రెక్ట‌ర్లు-2.. ఇద్ద‌రు హీరోలు.. ముగ్గురు నిర్మాత‌లు-3.. న‌లుగురు హీరోయిన్లు-4.. ఊహించ‌న‌న్ని మార్పుల‌తో మ‌లుపులు... ఇంట్రెస్టింగ్ క‌దూ? రోజుకో ట్విస్ట్ తో అటు ద‌ర్శ‌కుడి స‌హానాని‌కి ఇటు ఫ్యాన్స్ ఉత్కంఠ‌కి పరీక్ష పెడుతున్న ప్రాజెక్ట్ కూడా ఇది. వీరి వీరి గుమ్మ‌డి పండు వీరి పేర్లేమి? అంటే.. వివ‌రాల్లోకి వెళ‌దామా?

ఆ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ ... ఆచార్య‌. ఇద్ద‌రు డ‌రెక్ట‌ర్లు ఎవ‌రు అంటే?.. కోర‌టాల శివ అస‌లు ద‌ర్శ‌కుడు. సినిమా తెర‌కెక్కించేది ఆయ‌నే అయినా.. చిరంజీవికి బ్యాక్ గ్రౌండ్ లో సీన్లు చెప్ప‌డానికి వీవీ వినాయ‌క్ రెడీగా ఉన్నారు. ఖైదీనంబ‌ర్ 150 లాంటి సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రానికి డైరెక్ట‌ర్ గా వినాయ‌క్ ఇన్వాల్వ్ మెంట్ బాస్ కోరుకున్నార‌ట‌.

ఇక ఇద్ద‌రు హీరోలు ఎవ‌రో చెప్పాల్సిన ప‌నే లేదు. చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్ రేర్ కాంబినేష‌న్ మూవీ ఇది. ఇన్నేళ్ల‌లో డాడీ స‌న్ కాంబినేష‌న్ లో ఎక్కువ ర‌క్తి క‌ట్టించే సీన్లు ఉండే సినిమా ఇది. చ‌ర‌ణ్ పాత్ర నిడివి 40 నిమిషాలు ఉంటుంద‌న్న స‌మాచారంతో సీన్ వేరేగా ఉంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు.

ముగ్గు‌రు నిర్మాత‌లు ఎట్టాగా అంటే... మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా ఈ సినిమాని నిర్మిస్తుండ‌గా అల్లు అర‌వింద్ ఫైన్సాన్ చేస్తున్నారు. అలా ఆ ముగ్గురూ నిర్మాతల జాబితాలో చేరారు.

న‌లుగురు హీరోయిన్లు క‌థేమిటో చెప్పాల్సిన ప‌నే లేదు. కాజ‌ల్ ... మెయిన్ హీరోయిన్, త‌మ‌న్నా ... స్పెష‌ల్ సాంగ్ స‌హా ఊహించ‌ని రోల్ చేస్తోంది. రెజీనా .. సెకండ్ హీరోయినా.. ఐటెమ్ నంబ‌ర్ వ‌ర‌కేనా అన్న‌ది ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. కియారాను రామ్ చ‌ర‌ణ్ కి హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఒకే మూవీలో న‌లుగురు హీరోయిన్లు అంటే ప్రేక్ష‌కుల‌కు క‌నువిందే. 1-2-3-4 సంఖ్య‌ల వెన‌క అంత అర్థం ఉందా? అంటారా? అయినా.. వీళ్లంద‌రినీ క‌రోనా టెన్ష‌న్ పెట్టేస్తోంది. త్వ‌ర‌గా సెట్స్ కెళితే కానీ మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా తెలిసే ఛాన్స్ రాదు.