Begin typing your search above and press return to search.

చిరు-చెర్రీ స్టెప్పులు.. ‘ఆచార్య’లో దుమ్ములేవడం ఖాయం

By:  Tupaki Desk   |   2 Jan 2021 12:20 PM IST
చిరు-చెర్రీ స్టెప్పులు.. ‘ఆచార్య’లో దుమ్ములేవడం ఖాయం
X
చిరంజీవిని మెగాస్టార్ గా టాలీవుడ్ శిఖరాగ్ర సింహాసనం మీద కూర్చోబెట్టడంలో రెండు అంశాలు ఆయనకు గొడుగు పట్టాయి. నవరస నటనా వైవిధ్యం ఒకటైతే.. అనితర సాధ్యమైన నాట్యం మరో ఎత్తు. మెగాస్టార్ స్టెప్పేస్తే.. చిందేయని అభిమాని ఉండడంటే అతిశయోక్తికాదు. అందుకే.. ఆయన సినిమాల్లో మిగతా అంశాలకు ఎంత ప్రాధాన్య ఉంటుందో.. డ్యాన్స్ కు అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది.

రాబోతున్న చిత్రం ‘ఆచార్య’లోనూ డ్యాన్సులు దద్దరిల్లిపోయేలా ఉన్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవితో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సాంగ్ లో స్టెప్పులు వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మెగా తండ్రీకొడుకులపై డైరెక్టర్ కొరటాల శివ.. రాకింగ్ డాన్స్ ప్లాన్ చేసినట్లు టాక్. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బీట్ కు వీరిద్దరూ అద్దిరిపోయే స్టెప్పులేయనున్నట్టు తెలుస్తోంది.

కాగా.. ఆచార్య సినిమాలో చిరంజీవి సోలో సీన్స్ షూట్ చేయడం జనవరి 10తో ముగుస్తుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో షూట్ కు సెలవు ప్రకటించి.. ఫెస్టివల్ తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇక, COVID-19 కారణంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న రామ్ చరణ్.. ఫెస్టివల్ తర్వాతి షెడ్యూల్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరు-చెర్రీ స్పెషల్ సాంగ్ ను ఫిబ్రవరిలో షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ 30 రోజులు కేటాయించారు.

రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే.. చరణ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.