Begin typing your search above and press return to search.
'ఆచార్య' షూటింగ్ నత్తనడకన సాగడానికి కారణం అదేనా..?
By: Tupaki Desk | 30 Dec 2020 11:25 AM ISTమెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఆచార్య''. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందేశాత్మక అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. 'భరత్ అనే నేను' సినిమా తర్వాత చిరంజీవి కోసం చాలా రోజులు వెయిట్ చేసిన కొరటాల.. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. సెట్స్ పైకి వచ్చిందిలే అనుకుంటే అనేక అవాంతరాలతో ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. కరోనా అని.. చరణ్ బిజీ షెడ్యూల్స్ అని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నత్తనడకన సాగుతోంది.
వాస్తవానికి స్టార్ హీరోలు సినిమాలకు డేట్స్ ఇచ్చాక షూటింగ్ షెడ్యూల్స్ ఆగే ప్రసక్తే ఉండదు. డబుల్ త్రిబుల్ కాల్షీట్స్ ఉన్నా సరే హీరోకి ఇబ్బంది కలగకూడదనే ధోరణితో నిర్మాతలు షూటింగ్స్ ఆగకుండా ప్లాన్ చేసుకుంటారు. అయితే 'ఆచార్య'కి చరణ్ కూడా ఒక నిర్మాత అవ్వడం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే అనేక మార్లు బ్రేకులు పడుతూ సాగుతోందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా కొరటాల శివ ఇప్పటికీ ఆన్ స్పాట్ లో ఇంప్రూవైజేషన్స్ చేయడం కూడా షూటింగ్ లేట్ అవడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా తండ్రీకొడుకులు చిరు - చిరుత కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి వాటిని 'ఆచార్య' టీమ్ ఎలా అందుకుంటారో చూడాలి.