Begin typing your search above and press return to search.
సంచలనానికి అర్థం చెప్పనున్న 'ఆచార్య'!
By: Tupaki Desk | 29 Dec 2020 8:00 PM ISTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. రాజమౌళి తరువాత అపజయమెరుగని దర్శకుడిగా ఆయనకి మంచి పేరు ఉంది. కొరటాల శివకి రచయితగా మంచి అనుభవం ఉంది. దర్శకుడిగా మెగాఫోన్ పట్టడానికి ముందు రచయితగా ఆయన కొన్ని హిట్ మూవీస్ కి పనిచేశారు. ఆ తరువాత దర్శకుడిగా రంగంలోకి దిగారు. తన సినిమాలకి తనే కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలను ఆయన సమకూర్చుకుంటారు. 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన, తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
'మిర్చి' సినిమాలో ఆయన ప్రభాస్ ను చాలా హ్యాండ్సమ్ గా చూపించారు. ప్రభాస్ - అనుష్క జోడీకి ఈ సినిమా నుంచే క్రేజ్ పెరిగింది. ఆ తరువాత కొరటాల శివ తెరకెక్కించిన 'శ్రీమంతుడు' మహేశ్ బాబు కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. 'భరత్ అనే నేను'తో ఆయన మహేశ్ బాబుకి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ కి 'జనతా గ్యారేజ్' తోను సూపర్ హిట్ ను అందించారు. ఇలా ఇంతవరకూ వరుస హిట్లతో తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. సందేశంతో కూడిన వినోదాత్మక చిత్రాలను అందించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఆయన తాజా చిత్రంగా చిరంజీవితో 'ఆచార్య'ను రూపొందిస్తున్నారు. చరణ్ నిర్మాణంలో .. కాజల్ కథానాయికగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకు చిత్రీకరణ జరుపుకుంది. సాధారణంగానే కథపై కొరటాల ఎక్కువ కసరత్తు చేస్తారు. ఈ సారి 'లాక్ డౌన్' సమయం కూడా కలిసి రావడంతో ఈ కథను మరింత టైట్ చేశారు. స్క్రీన్ ప్లే పరంగా కూడా ఎక్కడ వీక్ కాకుండా చెక్ చేసుకున్నారు. మరింత పకడ్బందీగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతో కొరటాల మరో సంచలనానికి తెరతీయడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 'రాధేశ్యామ్' .. 'ఆర్ ఆర్ ఆర్' వంటి భారీ బడ్జెట్ సినిమాల మధ్య కొరటాల 'ఆచార్య'ను దింపుతుండటం చూస్తుంటే, ఈ కథపై .. చిరంజీవికి గల క్రేజ్ పై ఆయనకి గల నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.