Begin typing your search above and press return to search.

అదిరిపోయేలా ఆచార్య ప్లాష్​బ్యాక్​ సీన్స్​.. మెగా ఫ్యాన్స్​కు పండగే..!

By:  Tupaki Desk   |   7 Dec 2020 5:00 PM IST
అదిరిపోయేలా ఆచార్య  ప్లాష్​బ్యాక్​ సీన్స్​.. మెగా ఫ్యాన్స్​కు పండగే..!
X
మెగాస్టార్​ కొత్త సినిమా ‘ఆచార్య’ కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ మోషన్​ పోస్టర్​ మెగా అభిమానులను విపరీతంగా అలరించింది. ఓ గొప్ప సామాజికఅంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు టాక్​.

మరోవైపు ఈ చిత్రంలో మెగా పవర్​స్టార్​ చరణ్​ కూడా నటిస్తుండటంతో ఫ్యాన్స్​కు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. కొరటాల శివ గత చిత్రాలన్నీ సూపర్​హిట్ లే. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక సందేశం ఉంటుంది. దీంతో మెగా అభిమానులతో పాటు ఇటు సినీ అభిమానుల్లోనూ ఆచార్యపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయశాఖ ఉద్యోగిగా నటిస్తున్నట్టు సమాచారం. అయితే పది నిమిషాల ప్లాష్​ బ్యాక్​లో మాత్రమే చిరంజీవి అలా కనిపిస్తారని టాక్​. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిరు డబుల్​ రోల్ చేస్తారని టాక్.​ చరణ్​ ఓ నక్సలైట్​గా కనిపిస్తారని సమాచారం.

చరణ్​ పాత్ర ఎన్ని నిమిషాలు ఉంటుందనే విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు చిరుకి జోడీగా కాజల్​ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జనవరి 1 నుంచి రామోజీఫిల్మ్​సిటీలో జరగబోయే షూటింగ్​లో కాజల్​ నటించనున్నది. ఓ స్పెషల్​సాంగ్​లో రెజీనా అలరించనున్నది. కొణిదెల ప్రొడక్షన్స్​పై రామ్​చరణ్​ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆదిలోనే ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గాడు. ఆచార్య స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే పలు వెబ్​సైట్లలో కథనాలు వచ్చాయి. వీటిని చిత్ర యూనిట్​ ఖండిస్తూ వస్తున్నది.