Begin typing your search above and press return to search.

ఆచార్య మ్యూజికల్‌ హిట్‌ ఖాయం

By:  Tupaki Desk   |   16 Nov 2020 9:00 PM IST
ఆచార్య మ్యూజికల్‌ హిట్‌ ఖాయం
X
మెగాస్టార్‌ చిరంజీవి సినిమా అంటేనే కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు. ఆయన అభిమానులు ఖచ్చితంగా చిరు మార్క్‌ డాన్స్‌ లు ఉండాల్సిందే అంటారు. చిరు రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ లు ఎప్పుడు కూడా సక్సెస్‌ మిస్‌ అవ్వలేదు. ఖైదీ నెం.150 సినిమాలో చిరంజీవి మార్క్‌ కామెడీ.. డాన్స్‌ మరియు యాక్షన్‌ ఉండటంతో ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చిరంజీవితో ప్రస్తుతం కొరటాల శివ సినిమాను తీస్తున్నాడు. అంటే ఖచ్చితంగా చిరంజీవి డాన్స్‌ లు ఓ రేంజ్‌ లో ఉండాలి. అందుకోసం కొరటాల చాలా వర్కౌట్‌ చేసి సంగీత దర్శకుడు మణిశర్మ నుండి అద్బుతమైన మాస్‌ మసాలా ట్యూన్స్‌ ను తీసుకున్నాడట.

కొరటాల గత సినిమాలను చూస్తే ఆయన మ్యూజిక్‌ పై ఎంతగా పట్టు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మిర్చి నుండి చివరి మూవీ భరత్‌ అనే నేను వరకు అన్ని కూడా మ్యూజికల్‌ గా పాజిటివ్‌ రెస్పాన్స్‌ ను దక్కించుకున్నాయి. ఇక చాలా కాలం తర్వాత ఫామ్‌ లోకి వచ్చిన మణిశర్మ కు చిరంజీవి అవకాశం ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు పలు సూపర్‌ డూపర్‌ గా సక్సెస్‌ అయ్యాయి. చాలా మ్యూజికల్‌ హిట్‌ గా నిలిచాయి. అందుకే ఆచార్య సినిమా కూడా ఖచ్చితంగా మ్యూజికల్‌ హిట్‌ గా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో మరోసారి చిరు మార్క్‌ స్టెప్పులు వేయబోతున్నాడు. ఖైదీ నెం.150 సినిమా తరహాలో ఇందులోని పాటలకు కూడా జానీ మరియు శేఖర్‌ లు డాన్స్‌ ను కంపోజ్‌ చేసే అవకాశం కొరటాల ఇచ్చాడట. ఈ నెల 20వ తారీకు నుండి ఆచార్య షూటింగ్‌ పునః ప్రారంభం కాబోతుంది. చరణ్‌ కు కూడా ఒక పాట ఉంటుందని అంటున్నారు. కనుక ఆ పాట మరింత హైలైట్‌ గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.