Begin typing your search above and press return to search.
ఆచార్య రన్ టైమ్ ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 20 April 2022 9:00 AM ISTప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఆచార్య చిత్రం విజువల్ ట్రీట్ గా నిలుస్తుందని దర్శకుడు కొరటాల శివ హామీ ఇచ్చారు. అతడు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తన చిత్రం సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుందని తాజా ఇంటర్వ్యూలో శివ అన్నారు. మూవీలో అవసరమైన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన భారీ కథ అలరిస్తుందని అన్నారు.
టీమ్ రీ-షూట్ లలో నిమగ్నమైందని ఇదే ఆలస్యం కావడానికి కారణమని కొన్ని ఊహాగానాలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించారు. ఇప్పటి వరకు తన సినిమాలేవీ రీషూట్ చేయలేదని పుకార్లపై నిప్పులు చెరిగారు. రామ్‌చరణ్- చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలను అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు అని శివ అన్నారు. అవి సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని అన్నారు. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఏప్రిల్ 23న ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం.
రామ్ చరణ్ సిద్ధ అనే ప్రధాన పాత్రను పోషిస్తుండగా పూజా హెగ్డే అతని లేడీ లవ్ పాత్రను పోషించింది. మరోవైపు ఆచార్య లో చిరంజీవి- కాజల్ అగర్వాల్ తో పాటు ఇతర ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు.
రన్ టైమ్ సంగతేంటీ?
ఇటీవలి కాలంలో సుమారు మూడు గంటల నిడివితో సినిమాలు రావడం ట్రెండ్ గా మారింది. హాలీవుడ్ తరహాలో తక్కువ నిడివి సినిమాలేవీ రావడం లేదు. ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 సహా పుష్ప కూడా రన్ టైమ్ ఎక్కువే. ఇప్పుడు ఆచార్య కూడా అదే రేంజులో రన్ టైమ్ విషయంలో ఎక్కడా తగ్గలేదని సమాచారం.
ఆచార్య రన్ టైం 2.46 గంటలు. అమెరికాలో అత్యంత భారీగా విడుదలవుతోంది. అక్కడ చాలా ముందుగానే పంపిణీ వర్గాలు సినిమా చూశాయట. దీంతో రన్ టైమ్ ఎంతో లీకైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంచుమించు అదే నిడివి ఉంటుందని భావిస్తున్నారు. ఫస్ట్ కాపీ వరకూ రన్ టైమ్ గురించి చిరుతో కొరటాల మంతనాలు సాగించారని సమాచారం. నిడివి ఎక్కువ ఉన్నా ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆచార్య అలరించనున్నాడని సమాచారం. దేవాదాయ శాఖ కుంభకోణం నక్సలిజం నేపథ్యంలో ఈ మూవీ ఆద్యంతం రక్తి కట్టించనుంది. ఇందులో చరణ్ పాత్ర చాలా స్పెషల్ గా డిజైన్ చేశారని సమాచారం.