Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కోసం 'ఆచార్య' మేకర్స్ క్రేజీ సర్ప్రైజ్..!!

By:  Tupaki Desk   |   9 March 2021 9:42 AM GMT
ఫ్యాన్స్ కోసం ఆచార్య మేకర్స్ క్రేజీ సర్ప్రైజ్..!!
X
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా ఆచార్య. ఈ సినిమా పై రోజురోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నాడు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ సంయుక్తంగా ఆచార్యను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎప్పుడైతే ఆచార్య అనే పేరును ఖరారు చేసారో అప్పటినుండి సినిమా పై హైప్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తయిందట. అయితే ఇంతకాలం అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్స్ అన్ని ఒక్కసారిగా ప్రకటించి సర్ప్రైజ్ చేసారు ఆచార్య మేకర్స్. ఇప్పటికే ఆచార్య టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

ఇదిలా ఉండగా.. ఇటీవలే ఆచార్య సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన షూట్ ముగించుకొని వచ్చేసాడు. ఈ సినిమాలో రాంచరణ్ ఓ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సిద్ధ అనే పేరుతో రాంచరణ్ విద్యార్ధి సంఘానికి నాయకుడుగా నటించినట్లు తెలుస్తుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ రాంచరణ్ ఫుల్ పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే మెగాటీమ్ ఓ సర్ప్రైజ్ ఇవ్వనుందని టాక్. మరి ఆ సర్ప్రైజ్ చరణ్ క్యారెక్టర్ పోస్టర్ కావచ్చు అని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి మే 13న ఆచార్య థియేటర్లో సందడి చేయనున్నాడు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రాంచరణ్ తో పూజాహెగ్డే నటించింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.