Begin typing your search above and press return to search.

అయ్యయ్యో.. ఏంటి 'ఆచార్య' ఇలా వదిలేస్తున్నారు..!

By:  Tupaki Desk   |   10 March 2021 12:30 AM GMT
అయ్యయ్యో.. ఏంటి ఆచార్య ఇలా వదిలేస్తున్నారు..!
X
మెగాస్టార్‌ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కతున్న తాజా చిత్రం ''ఆచార్య''. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'కామ్రేడ్ సిద్ధ' అనే కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సమ్మర్ కానుకగా మే 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా మారెడుమిల్లి అటవీ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరిపారు. అలానే ఖమ్మం జిల్లాలోని ఇల్లందు బొగ్గు గనుల్లో చిత్రీకరణ జరుపుటున్నారు. అయితే 'ఆచార్య' సెట్స్ నుంచి వరుసగా ఫోటోలు లీక్ అవడంపై మెగా ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారని తెలుస్తోంది.

'ఆచార్య' స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి లీకుల బెడద తప్పలేదు. టైటిల్ ని చిరంజీవి రివీల్ చేయడంతో మొదలై చిరు - చరణ్ ఫోటోలు బయటకు వచ్చే వరకు కొనసాగుతోంది. నేను కూడా ఏమీ తక్కువ కాదన్నట్లు హీరోయిన్ పూజా హెగ్డే 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న విషయాన్ని వెల్లడించింది. ఇక తాజాగా చిరంజీవి - రామ్ చరణ్ సాయుధ దళాల దుస్తుల్లో షూటింగ్‌ లో పాల్గొన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. మెగాస్టార్ - మెగా పవర్ స్టార్ కలిసి ఇలా కనిపించడం పట్ల అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పటికీ.. డిఫరెంట్ గెట‌ప్స్ లో ఉన్న ఫోటోలు ఇలా ఎలా బయటకు రానిచ్చారని పెద‌వి విరుస్తున్నారు. దీనికి తోడు ఈ ఫోటోలు చూసిన వారు ఇందులో చిరు విగ్ తో కనిపిస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు కొరటాల శివ 'ఆచార్య‌'ని ఎలా తెర‌కెక్కిస్తున్నాడ‌నే టాక్ మాత్రం ఇప్పుడు ఫ్యాన్స్ లో మొద‌లైనట్లు తెలుస్తోంది.